బిగ్ బాస్ షో వల్ల కొంతమందికి చెడు జరిగినా మరి కొందరికి మాత్రం మంచి జరిగిందనే సంగతి తెలిసిందే.అలా బిగ్ బాస్ షో ద్వారా లాభపడిన సెలబ్రిటీలలో దివి ఒకరు.
బిగ్ బాస్ షో తర్వాత దివికి సినిమాలలో ఆఫర్లు రావడంతో పాటు ఆమెను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.సోషల్ మీడియాలో కూడా దివికి ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
సోషల్ మీడియాలో తరచూ ఫోటోలను షేర్ చేయడం ద్వారా దివి వార్తల్లో నిలుస్తున్నారు.అయితే దివి సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేయగా ఒక నెటిజన్ దివి షేర్ చేసిన ఫోటో గురించి స్పందిస్తూ దివి అందంతో చంపేస్తోందని కేసు పెట్టాలని తెలిపారు.
మరోవైపు దివికి స్టార్స్ సినిమాలలో వరుసగా ఆఫర్లు వస్తే మాత్రం ఆమె కెరీర్ పుంజుకునే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం దివికి ఆఫర్లు వస్తున్నా భారీస్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టే ఆఫర్లు అయితే రావడం లేదనే చెప్పాలి.

మరి కొందరు నెటిజన్లు దివి చూపులలో మ్యాజిక్ ఉందని మ్యాజిక్ అంటే దివి దివి అంటే మ్యాజిక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.దివి ఫోటోలను షేర్ చేసినా ఆ ఫోటోలు ట్రెడిషనల్ డ్రెస్సుల్లోనే ఫోటోలు దిగుతుండటం గమనార్హం.దివి మరింత బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

బిగ్ బాస్ దివి కెరీర్ పరంగా ఎదుగుతున్నా ఒదిగి ఉంటున్నారు.ఇతరులకు గౌరవం ఇచ్చే అతికొద్ది మంది సెలబ్రిటీలలో దివి ఒకరు కావడం గమనార్హం.హీరోయిన్ గా దివి మరిన్ని ఆఫర్లను సొంతం చేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది.
నటిగా తన స్థాయిని పెంచుకునే విషయంలో దివి సక్సెస్ అవుతున్నారు.దివి ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం లేదని తెలుస్తోంది.







