ప్రముఖ టాలీవుడ్ సింగర్లలో ఒకరైన శ్రావణ భార్గవి తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.అన్నమయ్య కీర్తన పాడే సమయంలో శ్రావణ భార్గవి చేసిన పనులపై విమర్శలు వ్యక్తమయ్యాయి.
సాధారణంగా శ్రావణ భార్గవి పాటను పాడి ఉంటే ఏ సమస్య వచ్చేది కాదు.బీజేపీ నేత శ్వేతారెడ్డి తాజాగా శ్రావణ భార్గవి గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
శ్రావణ భార్గవి చేసిన వీడియో చెత్తగా, చండాలంగా ఉందని శ్వేతారెడ్డి అన్నారు.మన దేవుళ్లు, దేవాలయాలు, హిందూ సాంప్రదాయాల గురించి అవతలి వాళ్లు కామెంట్ చేసిన ప్రతిసారి నేను చెబుతున్నానని శ్వేతారెడ్డి చెప్పుకొచ్చారు.
మనమే మన తల్లిని అవమానించుకుంటే అవతలి వాళ్లు కామెంట్ చేయకుండా ఉంటారా అని శ్వేతారెడ్డి ప్రశ్నించారు.అన్నమయ్య పాటలను సింగర్లు భక్తిభావంతో పాడతారని శ్వేతారెడ్డి అన్నారు.
శ్రావణ భార్గవి మాత్రం ఆ పాటలను కాళ్లు ఊపుతూ అడ్డదిడ్డంగా పాడిందని శ్వేతారెడ్డి కామెంట్ చేశారు.

శ్రావణ భార్గవికి డివర్స్ డిప్రెషన్ ఉంటే వేరే వీడియోలు చేసుకోవాలని అంతే తప్ప హిందూ దేవుళ్లను కించపరచవద్దని శ్వేతారెడ్డి చెప్పుకొచ్చారు.నీ కోతి మొహం, చింపాంజీ మొహంపై పాటలు రాసుకుని పాడుకోవాలని శ్వేతారెడ్డి శ్రావణ భార్గవిపై ఫైర్ అయ్యారు.తాను అందరు సింగర్లకు చెబుతున్నానని దేవుడి పాటలను కించపరచవద్దని శ్వేతారెడ్డి కోరారు శ్వేతారెడ్డి కామెంట్ల గురించి శ్రావణ భార్గవి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

బీజేపీ మహిళా నేతగా పాపులారిటీని సొంతం చేసుకున్న శ్వేతారెడ్డి భవిష్యత్తులో పొలిటికల్ గా మరింత ఎదిగే దిశగా అడుగులు వేస్తున్నారు.శ్వేతా రెడ్డి రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో సక్సెస్ అవుతారో లేదో చూడాల్సి ఉంది.శ్వేతారెడ్డిని అభిమానించే అభిమానులు సోషల్ మీడియాలో ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు.శ్రావణ భార్గవి విషయంలో శ్వేతారెడ్డి కామెంట్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.







