తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ఉన్నారనే విషయం చాలా మందికి తెలియడం లేదు.అయితే ఆమె తనవంతుగా పాదయాత్రలు చేస్తూ మీటింగులు ఏర్పాటు చేస్తున్నా మైలేజ్ మాత్రం రావడం లేదు.
ఆంధ్రా ఆడకూతురు తెలంగాణ మెట్టినింటి కోడలిగా మారి రాజకీయం చేసినా ఆమెలో ఆంధ్రా వాసనలు మాత్రం పోవడం లేదని పలువురు భావిస్తున్నారు.అయినా ఇవేమీ షర్మిల పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నారు.
నిత్యం అధికార పార్టీ టీఆర్ఎస్‌పైనే కాకుండా కాంగ్రెస్, బీజేపీలపైనా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుకు గోదావరి వరదల వల్ల కలిగిన నష్టాన్ని ప్రజల నుంచి దృష్టి మళ్లించేందుకు పోలవరం ప్రాజెక్టుపై ఆరోపణలు చేస్తున్నారు.
భద్రాచలం పరిధిలోని విలీన మండలాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని టీఆర్ఎస్ నేతలు ఏపీ నేతలను డిమాండ్ చేస్తున్నారు.అయితే వచ్చే ఎన్నికల్లో ఖమ్మంలోని పాలేరులో పోటీకి దిగుతున్న షర్మిలను విలీన గ్రామాల రాజకీయ వ్యాఖ్యలు ఇరుకున పడేలా చేశాయి.
ఆంధ్రా, తెలంగాణ మధ్య రాజుకున్న ఈ వివాదం షర్మిలను కలవరపెడుతున్నాయి.

షర్మిల ఈ అంశంపై తెలంగాణకు మద్దతుగా మాట్లాడితే ఏపీలో అధికారంలో ఉన్న అన్న జగన్ పార్టీ ఇబ్బందుల్లో పడుతుంది.ఒకవేళ మాట్లాడకపోతే ఆమెను ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు.దీంతో ముందు నుయ్యి.
వెనుక గొయ్యి అన్న చందాన షర్మిల పరిస్థితి తయారైంది.ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా దగ్గర ఉండే గ్రామాల విలీనంపై షర్మిల ఎందుకు మాట్లాడడం లేదని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.

పోలవరం ప్రాజెక్ట్ వల్ల భద్రాద్రి మునిగినా.గ్రామాలన్నీ నీటితో నిండిపోయినా షర్మిల స్పందించకపోవడం వివాదాస్పదంగా మారింది.దీంతో ఖమ్మం జిల్లా ప్రజలు షర్మిలపై మండిపడుతున్నారు.ర్మిల ఆంధ్రా ప్రయోజనాల కోసం పాటుపడుతున్నారని ఆరోపిస్తున్నారు.పైగా తెలంగాణ ప్రజలకు ఆత్మాభిమానం ఆత్మీయంగా ఉంటుంది.నచ్చితే నెత్తిన పెట్టుకుంటారు.
నచ్చకపోతే పాతరేస్తారు.వారికి ఏదైనా ఎక్కువే అంటారు.
ఇక్కడి నీళ్లు నిధులు నియామకాల కోసం దశాబ్ధాలుగా ఆంధ్రా నేతలతో పోరాడి చివరకు రాష్ట్రాన్ని సాధించుకున్నారు.ఈ నేపథ్యంలో భద్రాచలం గ్రామాల విలీనంపైనా ఉద్యమం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
తాజా పరిణామాలతో షర్మిల స్టాండ్ ఎలా ఉంటుందో ఆసక్తికరంగా మారింది.







