ఇటీవల కాలంలో ఒక్క హిట్టు వచ్చిందంటే చాలు స్టార్ హీరోలు రెమ్యునిరేషన్ ఏ రేంజ్ లో పెంచేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఒక్కసారిగా ఐదు పది కోట్లు పెంచుతూ నిర్మాతలకు షాక్ ఇస్తున్నారు స్టార్ హీరోలు.
అయితే ఇప్పటికే ఇలా భారీగా పెరిగిపోయిన రెమ్యునరేషన్ లతో నిర్మాతలు బెంబేలెత్తిపోతున్నారు.దీనికి తోడు అదనపు ఖర్చులు నిర్మాతల జేబులకు చిల్లులు పెడుతున్నాయి అన్న టాక్ కొన్ని రోజులనుంచి ఇండస్ట్రీలో వినిపిస్తుంది అన్న విషయం తెలిసిందే.
ఎందుకంటే స్టార్ హీరోలకు ప్రత్యేకమైన స్టైలిస్ట్, హెయిర్ స్టైలిస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్ ఇలా చెప్పుకుంటూ పోతే హీరోలను రెడీ చేసి సెట్స్ లోకి తీసుకెళ్లి వరకే భారీగా ఖర్చు అవుతుందట.
ఎందుకంటే ప్రస్తుత కాలంలో టాప్ హీరోలుగా కొనసాగుతున్న వారందరూ కూడా ముంబై టెక్నీషియన్స్ వైపు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
వైవిధ్యమైన సినిమాలే ఎక్కువగా చేస్తున్న నేపథ్యంలో ప్రత్యేకమైన కాస్ట్యూమ్స్ ప్రత్యేకమైన హెయిర్ స్టైలిస్ట్ ప్రత్యేకమైన స్టైలిస్ట్ కోసం ముంబయి టెక్నీషియన్స్ ను రప్పిస్తున్నారు.దీంతో తెలుగు హీరోల కోసం ముంబై టెక్నీషియన్స్ గట్టిగానే ఛార్జ్ చేస్తున్నారట.
ఉదాహరణకు తీసుకుంటే బన్నీ సుకుమార్ కాంబినేషన్లో పుష్ప 2 తెరకెక్కుతోంది.ఇక దీని కోసం హెయిర్ స్టైలిస్ట్ ముంబై నుంచి పిలిచారట.

అతని రెమ్యునరేషన్ రోజుకు లక్షన్నర రెమ్యునిరేషన్ ఫిక్స్ చేశారట.ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా రానుపోను బిజినెస్ క్లాస్ విమాన టికెట్లు ఇక హెయిర్ స్టైలిస్ట్ కు పర్సనల్ గా ముగ్గురు సిబ్బంది వారికి సంబంధించిన విమానం టికెట్లు ఇలా అన్ని కలుపుకుంటే రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ ఖర్చు వస్తున్నట్లు తెలుస్తోంది.అంతేకాదండోయ్ ఇలా వచ్చిన వారికి వారికి హోటల్ వసతి కూడా కల్పించాల్సి ఉంది.అది కూడా స్టార్ హోటల్లో.

ఇక ఆ బిల్లు కూడా తడిసి మోపెడవుతుందట.ఒక హెయిర్ స్టైలిస్ట్ కే ఇంత ఖర్చు అయితే ఇక మిగిలిన అన్ని విభాగాలకు సంబంధించిన టెక్నీషియన్స్ కి ఎంత ఖర్చు అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ క్రమంలోనే ఎలాగైనా ఈ ఖర్చులు తగ్గించాలని ప్లాన్ లో ఉన్నారట స్టార్ నిర్మాతలు. ఏం జరుగుతుందో చూడాలి మరి.







