టాలీవుడ్ రౌడీ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ.రోజురోజుకూ ఆయన అభిమానుల సంఖ్య పెరిగిపోతుంది.
విజయ్ దేవరకొండకు టాలీవుడ్ లో మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగి పోతుంది.ఆయన ప్రతి ఒక్కరికి ఫేవరేట్ హీరోగా మారి పోతున్నాడు.
ఇప్పుడు జరిగింది తెలుసుకుంటే ఇదే నిజం అనిపించక మానదు.విజయ్ భారీ కటౌట్ ను ఏర్పాటు చేసి ఆయన ఫ్యాన్స్ హంగామా చేస్తున్నాడు.
ప్రెసెంట్ విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైగర్‘ సినిమా మరొక నెల రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఆగష్టు 25న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
మొదటి సారి పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు విజయ్ ఇంకా పూరీ.ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో విజయ్ మరింత స్టార్ డమ్ ను పెంచుకోవాలని చూస్తున్నాడు.
ఇక రిలీజ్ కూడా దగ్గర పడడంతో మేకర్స్ ప్రొమోషన్స్ లో స్పీడ్ పెంచుతున్నారు.ఈ క్రమంలోనే రేపు ఈ సినిమా నుండి థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు.
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదల అయ్యి విశేష స్పందన లభించింది.ఇక ట్రైలర్ కూడా భారీ రికార్డులను క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసారు.

ఈ క్రమంలోనే ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సుదర్శన్ థియేటర్ వద్ద రౌడీ స్టార్ ఫ్యాన్స్ అంతా కలిసి ఏకంగా 75 అడుగుల కటౌట్ ను ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని నిరూపించు కున్నారు.ఈ కటౌట్ లైగర్ సినిమాలోని బాక్సర్ పాత్రకు సంబందించినది.ఇందులో విజయ్ ఇన్నర్ వేర్ లో నిలబడి తన సిక్స్ ప్యాక్ బాడీ తో ఉన్నారు.
అయితే ఈ కటౌట్ పై ఆయన ఫ్యాన్స్ బాగుంది అని మెచ్చుకుంటుంటే.కొంత మంది ట్రోల్స్ చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను పూరీ జగన్నాథ్ తో పాటు బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సంయుక్తం గా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.







