కోలీవుడ్ లో చాలా కాలం తర్వాత స్టార్ హీరో శింబు హిట్ కొట్టిన సినిమా మానాడు.వెంకట్ ప్రభు డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కింది.
తమిళ ప్రేక్షకులను ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంది.అయితే మానాడు తెలుగు వర్షన్ కూడా రెడీ చేసి రిలీజ్ చేద్దాం అనుకునేసరికి సినిమా చూసిన సురేష్ బాబు తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు.
ఈ క్రమంలో ఆ సినిమా తెలుగు రైట్స్ కొనేశారు.మొన్నటిదాకా నాగ చైతన్య హీరోగా మానాడు రీమేక్ వస్తుందని వార్తలు వచ్చాయి.
కానీ ఫైనల్ గా ఆ రీమేక్ లో రానాని హీరోగా ఫిక్స్ చేశారట.రానా హీరోగా మానాడు తెలుగు రీమేక్ ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది.
మానాడు సినిమా తెలుగు వర్షన్ కి రానానే పర్ఫెక్ట్ చాయిస్ అని ప్రేక్షకులు అంటున్నారు.
అయితే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రానా ఆల్రెడీ తన డెబ్యూ మూవీ లీడర్ చేశాడు.
అయితే అది శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వచ్చిన సినిమా కాబట్టి అది ఆయన మార్క్ తో తెరకెక్కింది.కానీ మానాడు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథ అయినా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా వచ్చింది.
ఈ సినిమా తెలుగులో పర్ఫెక్ట్ గా వర్క్ అవుట్ అవుతుందని చెప్పొచ్చు.మానాడు సినిమాలో శింబు సరసన మళయాళ భామ కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించింది.
ఆండ్రియా కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది.మరి తెలుగులో హీరోగా రానా ఫిక్స్ అవగా మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది తెలియాల్సి ఉంది.
ఈ సినిమాని సురేష్ బాబు ఏ డైరక్టర్ చేతిలో పెడతాడు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.







