యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో ఎన్నో సంచలన విజయాలు ఉన్నా తారక్ కు ఉన్న టాలెంట్ కు ఇప్పటివరకు తారక్ కు దక్కిన గుర్తింపుకు మధ్య చాలా తేడా ఉందని ఆయన అభిమానులు భావిస్తారు.అయితే ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ నటుడిగా తారక్ రేంజ్ ను పెంచడంతో పాటు తారక్ కు గ్లోబల్ స్టార్ గా గుర్తింపు రావడానికి కారణమైంది.
తాజాగా తారక్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీలోని సీన్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అయింది.
ఆర్ఆర్ఆర్ మూవీ వీడియో క్లిప్ కు ఒక్క రోజులోనే 10 మిలియన్ కు పైగా వ్యూస్ వచ్చాయి.
ట్విట్టర్ లో ఈ స్థాయిలో వ్యూస్ వచ్చిన సినిమా ఆర్ఆర్ఆర్ మాత్రమే కావడం గమనార్హం.ఈ వీడియో వైరల్ కావడంతో తారక్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిందనే చెప్పాలి.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు టైమొచ్చిందని తారక్ భవిష్యత్తు సినిమాలు ఊహించని రేంజ్ లో విజయాలను సొంతం చేసుకోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నాయి.

సోలో హీరోగా 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను తారక్ సొంతం చేసుకోవాలని తారక్ అభిమానుల కోరిక కాగా ఆ కోరిక నెరవేరడానికి ఎంతో సమయం పట్టదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.హాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం ఈ సినిమాలో తారక్ అద్భుతమైన నటనను ప్రశంసిస్తున్నారు.కొన్ని సన్నివేశాల్లో తారక్ నటన అద్భుతం అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం తారక్ గ్లోబల్ స్టార్ గా మారిపోయారని ఒక హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కొమురం భీముడో సాంగ్ లో తారక్ చిన్నచిన్న ఎక్స్ ప్రెషన్లను సైతం అద్భుతంగా పలికించారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో ఇండస్ట్రీని శాసించే రేంజ్ కు ఎదగడం గ్యారంటీ అని కొంతమంది ఫ్యాన్స్ భావిస్తున్నారు.







