టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రంఆర్‌ఆర్‌ఆర్.భారీ అంచనాల నడుమ మార్చి 25వ తేదీన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో వసూళ్ళను సాధించిందో మనందరికీ తెలిసిందే.
ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు మించి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.అంతేకాకుండా రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబడుతూ ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 1100 కోట్లకు పైగా వసూలను రాబట్టి రికార్డులను సృష్టించింది.
అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించింది.
ఈ సినిమాను చూసిన ప్రతి ఒక సెలబ్రిటీలు కూడా దర్శకుడు రాజమౌళి పై అలాగే చిత్ర బృందంపై హీరోలు ఇద్దరిపై కూడా ప్రశంసల వర్షం కురిపించారు.
టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ఈ సినిమా విషయంలో స్పందించారు.కాగా ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ లో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమా మరొకసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఈ సినిమాలో ఎన్టీఆర్ నటించిన ఇంటర్వెల్ ఎంట్రీ సీన్ లో ఎంత అద్భుతంగా ఉందో మనందరికీ తెలిసిందే.

ఒక ట్రక్ లోఎలుగుబంట్లు, సింహాలు, పులులు, జింకలు, నక్కలతో జూనియర్ ఎన్టీఆర్ వైల్డ్ ఎంట్రీ ఇచ్చిన ఆ సీన్ ను చూస్తే నిజంగానే గూస్ బంప్స్ వస్తాయి అని చెప్పవచ్చు.థియేటర్లో ఈ సీన్ ను చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈలలో కేకలతో థియేటర్ మొత్తం మారుమోగిపోయే విధంగా అరిచారు.కాగా ప్రస్తుతం ఈ ఎంట్రీ సీన్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.ఓ విదేశీ యూజర్ ఈ సీన్ వీడియోను ట్విటర్‌లో షేర్ చేయగా అతి తక్కువ సమయంలోనే 12 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
అంతేకాకుండా ఈ సీన్‌ను షేర్ చేస్తూ ఆ యూజర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ ఇండస్ట్రీ గర్వపడేలా ఉన్నాయి.నేను ఇప్పటివరకు 29 ఎమ్‌సీయూ చిత్రాలను వీక్షించాను.
కానీ ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని ఈ ట్రక్ లాంటి అత్యద్భుతమైన షాట్‌ను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అని ఆ యూజర్ ట్వీట్ చేశాడు.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ ట్వీట్ ని చూసిన తారక్ అభిమానులు సంతోషంగా ఫీల్ అవుతూ ఆ వీడియోని ఆ ట్వీట్ ని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.







