గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణం అనేక మార్పులకు కారణమవుతోన్న సంగతి తెలిసిందే.అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి, అత్యధిక ఉష్ణోగ్రతలతో అనేక దేశాలు అల్లాడిపోతున్నాయి.
ఇక ఆహ్లాదకరమైన వాతావరణానికి పెట్టింది పేరైన యూరప్ దేశాలు సైతం ఇప్పుడు వాతావరణ మార్పులను ఎదుర్కొంటున్నాయి.గత కొన్ని రోజులుగా యూకే, స్పెయిన్, పోర్చుగల్ఫ్రాన్స్‌లలో ఎండలు మండిపోతున్నాయి.
బ్రిటన్‌లో మాత్రం పరిస్ధితి తీవ్రంగా వుంది.చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి.
దీనికి తోడు వడగాలులు వీస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.దీంతో బ్రిటన్ వాతావరణ విభాగం రెడ్ వార్నింగ్జారీ చేసింది.
లండన్‌తో పాటు ఇంగ్లాండ్‌లోని పలు ప్రాంతాల్లో వచ్చే కొన్ని వారాల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించింది.
సోమవారం ఎండ, వడగాలులు, ఉక్కపోతతో బ్రిటన్ వాసులు అల్లాడిపోయారు.
దీంతో కొన్ని రైలు సర్వీసులను రద్దు చేయగా.పాఠశాలలను మూసివేశారు.
అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని ప్రభుత్వం కోరింది.పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్‌లలోని గ్రామీణ ప్రాంతాల్లో కార్చిచ్చు కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకోవడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు.2019లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని బొటానిక్ గార్డెన్ పరిసరాల్లో నమోదైన 38.7 సెల్సియస్‌ల ఉష్ణోగ్రతే ఇప్పటి వరకు బ్రిటన్‌లో అత్యధికం.ఈ రికార్డు సోమవారం బద్ధలైంది.గడిచిన కొన్ని రోజులుగా దక్షిణ ఇంగ్లాండ్‌లో మధ్యాహ్న సమయానికే 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

జాతీయ రైలు నెట్‌వర్క్ సైతం ప్రయాణీకులు అత్యవసరమైతేనే తప్ప ప్రయాణాలు పెట్టుకోవాలని సూచించింది.వాతావరణ పరిస్ధితుల నేపథ్యంలో ఈశాన్య ఇంగ్లాండ్, లండన్ మార్గాల మధ్య కొన్ని సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.అటు లండన్ మెట్రో నెట్‌వర్క్ సైతం తాత్కాలికంగా వేగ పరిమితులను అమలు చేస్తోంది.ఎండకు, ఎండ వేడికి దూరంగా వుండటం, ఇళ్లను చల్లగా వుండేటట్లు చూసుకోవాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.
అయితే ఈ హాట్ వాతావరణం కారణంగా విద్యుత్, నీరు, మొబైల్ నెట్ వర్క్ సర్వీసులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం వుందని అభిప్రాయపడుతున్నారు.మరోవైపు ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు బ్రిటన్ వాసులు బీచ్‌లు, సరస్సులు, నదీ తీర ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు.







