వరద బాధితులకు జగన్ చేసే సాయమెంత?

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగడంతో ఉభయ గోదావరి జిల్లాలు భారీగా నష్టపోయాయి.ముఖ్యంగా నాలుగు జిల్లాలలోని పలు గ్రామాలు జలమయంలో చిక్కుకున్నాయి.

 How Much Help Does Jagan Give To The Flood Victims Andhra Pradesh, Godavari Flo-TeluguStop.com

పంటలు నీట మునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.దీంతో టీడీపీ, జనసేన పార్టీలు అధికార వైసీపీపై మండిపడుతున్నాయి.

వరద ప్రవాహాన్ని అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శల బాణాలు ఎక్కుపెట్టాయి.అటు వరద బాధితులకు సహాయం చేయడంలో జగన్ తాత్సారం చేస్తున్నారంటూ మండిపడుతున్నాయి.

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే చేస్తే సరిపోతుందా అని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు.పీకల్లోతు వరదల్లో ప్రజలు మునిగి ఉంటే జగన్‌ తన కాలికి బురద అంటకుండా హెలికాఫ్టర్‌లో తిరుగుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

సీఎం జగన్ గాల్లో తిరిగితే ప్రజల వరద ఎలా తెలుస్తాయని ఎద్దేవా చేశారు.ఈ నేపథ్యంలో ఈనెల 20, 21, 22 తేదీల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు.

Telugu Andhra Pradesh, Chandrababu, Godavari Floods, Heavy, Jagan, Ysrcp-Telugu

మరోవైపు జగన్ మాత్రం తాము వరద బాధితులకు సహాయం చేస్తున్నా ఎల్లో మీడియా కావాలనే దుష్ప్రచారం చేస్తోందని సీఎం జగన్ మండిపడుతున్నారు.ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలకు బెదరకుండా బాధితులకు సహాయం చేయాలని జగన్ అధికారులకు పిలుపునిస్తున్నారు.వరదలోనూ బురదజల్లడానికి నానారకాలుగా ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.గతంలో ఏ ప్రభుత్వం వరద బాధితులకు రూ.2వేలు ఆర్ధిక సహాయం చేయలేదన్నారు.అటు ప్రభుత్వ సహాయక చర్యలు అంతంత మాత్రంగానే ఉండడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వరద బాధితులకు రూ.10వేలు ఆర్ధిక సహాయం చేయాలని డిమాండ్ చేసిన జగన్ ఇప్పుడు తూతూమంత్రంగా రూ.2వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని.పెరిగిన ధరలతో రూ.2వేలు ఏమూలకు సరిపోతాయని ప్రశ్నిస్తున్నారు.సర్వం కోల్పోయి తాము ఆవేదన చెందుతుంటే ప్రభుత్వం గొప్పలకు పోతుందని పలువురు మండిపడుతున్నారు.

మొత్తానికి నివాసం మునిగిపోయి విద్యుత్ లేక, తిండిలేక వరద బాధితులు అవస్థలు పడుతుంటే వైసీపీ ఎమ్మెల్యేలు వారిని పట్టించుకున్న పాపాన పోవడం లేదని తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube