తెలంగాణలో ఒకవైపు ప్రజలు వరదలతో అల్లాడుతుంటే సీఎం కేసీఆర్ మాత్రం వరదలపైనా రాజకీయ పబ్బం గడుపుకోవడం చర్చనీయాంశంగా మారింది.తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు క్లౌడ్ బరస్ట్ కారణమని కేసీఆర్ అనుమానం వ్యక్తం చేశారు.
క్లౌడ్ బరస్ట్ కారణంగానే గోదావరి నదికి గతంలో ఎన్నడూ లేని విధంగా వరదలు పోటెత్తాయని.తీవ్ర నష్టం వాటిల్లిందని కేసీఆర్ ఆరోపించడం హాట్ టాపిక్ అవుతోంది.
ఈ నేపథ్యంలో నిజంగానే భారీ వర్షాల వెనుక కుట్ర ఉందా అని పలువురు చర్చించుకుంటున్నారు.
నిజానికి వరద ముంపు కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రెండు పంపు హౌస్‌లు నీటిలో మునిగిపోయాయి.
దీంతో బీజేపీ, కాంగ్రెస్ నేతలు కేసీఆర్‌పై పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు.ఈ ఆరోపణల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ అనే అంశాన్ని తెరపైకి తెచ్చారని పలువురు విమర్శలు చేస్తున్నారు.
నిజంగానే కేసీయార్ అనుమానం ప్రకారం క్లౌడ్ బరస్ట్ జరిగిందని అనుకుంటే ఈ తతంగం మహారాష్ట్రలో జరగాలి.క్లౌడ్ బరస్ట్ మహారాష్ట్రలో జరిగితే గోదావరి నదికి వరదలు వచ్చి తెలంగాణాను ముంచెత్తాలి.
నిజంగా అదే జరిగితే మహారాష్ట్ర కూడా నష్టపోతుంది.

ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ మద్దతు ఇస్తున్న శివసేన ప్రభుత్వమే ఉంది.క్లౌడ్ బరస్ట్ ప్రక్రియ కేంద్రం చేతిలో ఉందని భావిస్తే… తెలంగాణాలో ఆకస్మికంగా భారీవర్షాలు వరదలను సృష్టించి కేసీఆర్‌ను ఇబ్బందులకు గురిచేసే ఉద్దేశం బీజేపీకి ఉంటే మరి మహారాష్ట్రలోని సొంత ప్రభుత్వాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇబ్బందుల్లోకి నెట్టుకుంటుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.వరదల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులకు పక్కదారి పట్టించడానికి.
మీడియాలో వేరేలా డిస్కషన్లు జరగడానికి మాత్రమే కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ అనే ఆయుధం వాడారని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.అటు కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ కారణంగానే గోదావరికి వరద వచ్చిందని నిపుణులు ఆరోపిస్తున్న తరుణంలో తనపై విమర్శలను దారి మళ్లించేందుకు కేసీఆర్ పన్నిన పన్నాగమే క్లౌడ్ బరస్ట్ అని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.







