అమరావతి: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్.గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం జరుగుతోన్న తీరుపై సీఎం సమీక్షించారు.
ఎమ్మెల్యేల్లో ఎవరివైనా లోపాలు ఉంటే సరిగిద్దుకోవాలని సీఎం ఆదేశించారు.ఎమ్మెల్యేలు ఎవరికీ సీఎం జగన్ వార్నింగ్ లు ఇవ్వలేదు.
ప్రజల్లోకి వెళ్లి ఆశీస్సులు కోరాలని వెనకబడితే ఇబ్బందవుతుందని సీఎం చెప్పారు.ఇబ్బంది వల్ల పార్టీ నష్టపోతుందని తేలితే కచ్చితంగా దానిగురించి ఆలోచిస్తామని సీఎం స్పష్టంగా చెప్పారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాటు మాత్రమే అధికారంలో ఉండాలని రాలేదు.
నిరంతరం ప్రజల ఆశీస్సులతో ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది.
ప్రజలే ఎమ్మెల్యేల గ్రాఫ్ ను నిర్ణయిస్తారు.ప్రజల్లో తిరిగితే ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరుగుతుంది.
ఆరోగ్య సమస్యలు,పార్టీ కార్యక్రమాలు,రకరకాల కారణాల వల్ల కొందరు ఇంకా ప్రారంభించలేదు.అందరూ తప్పనిసరిగా గడప గడప కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం సూచించారు.
వైకాపా తిరిగి అధికారంలోకి వస్తే మహిళల పసుపు కుంకాలు పోతాయని పవన్ వ్యాఖ్యలపై స్పందించడం వృథా.







