ఇప్పడు వర్షాకాలం. జో్రుగా వర్షాలు కురుస్తున్నాయి.కొన్ని చోట్ల కుండపోతగా వర్షాలు కురుస్తన్నాయి.రుతుపవనాలు, తుఫాన్ల కారణంగా భారీ వర్షాలు కురిసి వరదలు ముంచెత్తుతున్నాయి.ఇప్పటి వరకు వర్షాలు కురవడానికి కారణాలు ఇవేనని మనకు తెలుసు.కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందంటూ కొత్త వాదనను తెరమీదకు తెచ్చారు.
కేసీఆర్ మాటలు విని శాస్త్ర వేత్తలతో పాటు, సామాన్య ప్రజలు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.రుతుపవనాలు, తుఫాన్లు, వాతావరణంలో వచ్చే మార్పు వల్ల వర్షాలు కురుస్తాయని మనందరికీ తెలుసు.
కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఇప్పడు పడుతున్న వర్షాలకు కొత్త అర్థం చెప్పారు.దీని వెను విదేశీ కుట్ర ఉందన్నారు.గోదావరిపై క్లౌడ్ బరస్ట్ కుట్ర జరిగిందనే అనుమానం వ్యక్తం చేశారు.క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్దతి వచ్చిందన్నారు.
దేశంలో ఆకస్మిక వరదలు స్పష్టిస్తున్నారని చెప్పారు.దేశంలో ఇతర దేశాల వాళ్లు కుట్రలు చేస్తున్నారన్న కేసీఆర్.
గతంలో లడఖ్ లో లేహా లో ఇలాంటే వరదలే వచ్చాయన్నారు.ఉత్తరాఖండ్ లో అలాగే చేశారన్నారు.
మన దేశంలోనూ కొన్ని ప్రాంతాలలో క్లౌడ్ బరస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోందని కేసీఆర్ చెప్పారు.

మరోవైపు కేసీఆర్ వ్యాఖ్యల్ని బీజేపీ నేతలు ఖండించారు.క్లౌడ్ సీడింగ్, బరస్ట్ రెండూ వేర్వేరని బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు.ప్రకృతి పరంగా క్లౌడ్ బరస్ట్ అవుతుందన్నారు.క్లౌడ్ సీడింగ్ మనుషులు సృష్టిస్తారన్నారు.ఎత్తైన గుట్టలు ఉన్నప్పుడు మేఘాలు తగిలినప్పుడు క్లౌడ్ బరస్ట్ అవుతాయన్నారు.
క్లౌడ్ బరస్ట్ పై కేసీఆర్ చేసి వాఖ్యాలన శాస్త్రవేత్తలు ఖండిస్తున్నారు.ఇది సాధ్యం కాదంటున్నారు.
ప్రకృతి సిద్ధంగానే వర్షాలు కురుస్తున్నాయని చెబుతున్నారు.కేసీఆర్ వ్యాఖ్యలు హాస్యస్పదంగా ఉన్నాయంటున్నారు.
కేసీఆర్ మాటలు విని శాస్త్ర వేత్తలతో పాటు, సామాన్య ప్రజలు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.







