సుమ కనకాల ప్రస్తుతం వరుస సినిమా ఈవెంట్లతోనూ అలాగే బుల్లితెర కార్యక్రమాలతోనూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈ విధంగా సుమ వరుస కార్యక్రమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నప్పటికీ ప్రత్యేక ఈవెంట్లలో కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.
అయితే ఒకప్పుడు ఒంటరిగా సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించేది కానీ ఈ మధ్యకాలంలో ఈమె బాబా భాస్కర్ మాస్టర్ తో కలిసి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఈ విధంగా వేదికపై సుమ బాబా భాస్కర్ మాస్టర్ ఇద్దరు ఒకరిపై ఒకరు పంచులు వేసుకుంటూ అందరిని నవ్విస్తున్నారు.
తాజాగా స్టార్ మా బోనాల స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా సుమ, బాబా భాస్కర్ మాస్టర్ సందడి చేశారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా దీనిపై సుమ ఓ వ్లాగ్ చేసింది.బిహెండ్ సీన్స్ అంటూ సుమ యూట్యూబ్ చానెల్లో ఓ వీడియోను వదిలింది.
ఇక ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.ఇక ఈ వీడియోలో సుమ ఈవెంట్ కోసం తాను ఎలా రెడీ అవుతున్నారు ఏంటి అనే విషయం గురించి చెబుతూ ఫన్ క్రియేట్ చేసింది.

ఇక అక్కడ షూటింగ్ ఎలా జరుగుతుంది ఏంటి ఎంత వరకు షూటింగ్ జరుగుతుందనే విషయాలను తెలియజేస్తూ తాను మాత్రం సాయంత్రం 6 వరకు మాత్రమే సెట్ లో ఉంటానని 6 గంటలకు తిరిగి ఇంటికి వెళ్లిపోతానని తెలిపారు.ఇక ఈ వీడియోలో భాగంగా ఈవెంట్ కు హాజరైన వారందరినీ చూపించారు.అయితే ఈ వీడియోలో ముక్కు అవినాష్, బాబా భాస్కర్ మాస్టర్ సందడి చేశారు.

ఈ క్రమంలోని వీరిద్దరూ సుమ వీడియోలో కనబడుతూ తమ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియజేశారు.ఇక తన యూట్యూబ్ ఛానల్ లో వీరిద్దరూ తమ యూట్యూబ్ ఛానల్ ని ప్రమోట్ చేసుకోవడంతో సుమ తల పట్టుకుంది.ఇకపోతే ప్రతి ఈవెంట్లోను తనను ఒకరు ఎంతో టార్చర్ చేస్తున్నారని ఆ వ్యక్తి మరెవరో కాదు అంటూ బాబా భాస్కర్ మాస్టార్ ను చూపించింది.
ప్రస్తుతం సుమ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది.







