అక్కినేని యంగ్ హీరోల్లో నాగ చైతన్య ఒకరు.ఈయన ఎప్పుడు క్లాసీ లుక్ తో అభిమానులను ఆకట్టు కుంటాడు.
ఎక్కువగా ప్రేమ కథలు చేస్తూ మెప్పిస్తూ మరింత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు.అయితే కెరీర్ లో ఫస్ట్ టైమ్ హెవీ ఇంటెన్స్ థ్రిల్లింగ్ కథతో చైతూ రాబోతున్నాడు.
ప్రస్తుతం నాగ చైతన్య విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ‘ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మజిలీ, వెంకీమామ, లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో వరుసగా హిట్స్ కొట్టుకుంటూ వస్తున్న చైతూ ఇప్పుడు థాంక్యూ అంటూ రాబోతున్నాడు.ఈ సినిమా నుండి వచ్చిన టీజర్, సాంగ్స్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.
ఈ సినిమా జులై 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇక ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా.
నాగ చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే మాళవిక నాయర్, అవికా గోర్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమా తర్వాత కూడా చైతూ వరుస సినిమాలను లైన్లో పెట్టాడు.ఈ క్రమంలోనే చైతూ పరుశురామ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నాడు.ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ తో సర్కారు వారి పాట చేసి సూపర్ హిట్ అందుకున్నాడు.ఇక ఇప్పుడు నాగ చైతన్య తో సినిమా లైన్లో పెట్టాడు.
కాగా ఈ సినిమా కథపై ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.ఈ సినిమాలో చైతూ రెండు విభిన్నమైన రోల్స్ పోషించ నున్నాడని టాక్.
తండ్రిగానూ అలాగే కొడుకు పాత్రలోనూ నాగ చైతన్య కనిపిస్తాడట.ఈ సినిమా తండ్రీకొడుకుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామా అని అలాగే మంచి లవ్ స్టోరీ కూడా యాడ్ చేసి పరశురామ్ అద్భుతంగా తెరకెక్కించ నున్నాడని టాక్ వస్తుంది.
ఇక ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.







