యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కెరియర్ మంచి ఓష్ మీద ఉందని చెప్పొచ్చు.మజిలీ నుంచి ఈమధ్య వచ్చిన బంగార్రాజు వరకు వరుస హిట్లతో దూసుకెళ్తున్న నాగ చైతన్య త్వరలో థ్యాంక్ యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈ సినిమాని దిల్ రాజు నిర్మించగా విక్రం కె కుమార్ డైరెక్ట్ చేశారు.ఈ సినిమాతో పాటుగా ఆమీర్ ఖాన్ లీడ్ రోల్ లో తెరకెక్కిన లాల్ సింగ్ చద్దా సినిమాలో కూడా నాగ చైతన్య నటించారు.
లాల్ సింగ్ చద్దా సినిమా టైం లో ఆమీర్ తో నాగ చైతన్యకు మంచి బాండింగ్ ఏర్పడింది.అందుకే చైతు లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆమీర్ ఖాన్ గెస్ట్ గా వచ్చారు.
ఇక ఇదే ఫ్రెండ్ షిప్ కొనసాగిస్తూ బాలీవుడ్ లో సోలో హీరోగా నాగ చైతన్యని ప్రమోట్ చేస్తున్నారట ఆమీర్ ఖాన్. నాగ చైతన్య హీరోగా ఆమీర్ ఖాన్ నిర్మాతగా బాలీవుడ్ లో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారట.
ఇది పక్కా లవ్ స్టోరీగా వస్తుందని తెలుస్తుంది.డిఫరెంట్ లవ్ స్టోరీ గా ఆమీర్ ఖాన్ ప్రొడక్షన్ లో నాగ చైతన్య మూవీ వస్తుందని టాక్.

దీనికి సంబందించిన అఫీషియల్ న్యూస్ బయటకు రావాల్సి ఉంది.ప్రస్తుతం తెలుగులో తన సత్తా చాటుతున్న నాగ చైతన్య హిందీ లో కూడా హీరోగా చేయాలని చూస్తున్నాడు.లాల్ సింగ్ చద్దాతో ఆల్రెడీ అక్కడ ఓ ఇమేజ్ ఏర్పరచుకోనున్న అక్కినేని హీరో ఆ తర్వాత సోలో హీరోగా చేసేందుకు రెడీ అయ్యాడని తెలుస్తుంది.మొత్తానికి ఆమీర్ ఖాన్ తో కలిసి నాగ చైతన్య పెద్ద స్కెచ్ వేశారని చెప్పొచ్చు.
లాల్ సింగ్ చద్దా సినిమా ఆగష్టు 11న రిలీజ్ చేస్తున్నారు.ఆ సినిమాని తెలుగులో చిరంజీవి రిలీజ్ చేస్తుండటం విశేషం.







