వారియర్ రెండు రోజుల కలెక్షన్లు అన్ని కోట్లా.. నష్టాలు తప్పవంటూ?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన ది వారియర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం లేదనే సంగతి తెలిసిందే.గురువారం రోజున ఈ సినిమాకు బాగానే కలెక్షన్లు వచ్చినా శుక్రవారం కలెక్షన్లలో మాత్రం ఊహించని స్థాయిలో డ్రాప్ కనిపించిందని సమాచారం అందుతోంది.రెండు రోజుల్లో ఈ సినిమా 9.32 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.

 The Warrior Movie Two Days Collections Details Here Goes Viral , Shocking Facts-TeluguStop.com

38 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ది వారియర్ సినిమా రెండు రోజుల్లో కేవలం పాతిక శాతం మాత్రమే బిజినెస్ తో పోల్చి చూస్తే కలెక్షన్లను సాధించింది.ఈ వీకెండ్ నాటికి 40 శాతం కలెక్షన్లను సాధించినా ఫుల్ రన్ లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం కష్టమేనని సమాచారం.

ఈ సినిమా ఏ స్థాయిలో నష్టాలను మిగుల్చుతుందో చూడాల్సి ఉంది.ఈ సినిమా రిజల్ట్ పై నమ్మకంతో రామ్ నైజాం, వైజాగ్ ఏరియాల హక్కులను కొనుగోలు చేశారు.

అయితే నైజాం ఏరియాలో ఈ సినిమా రెండో రోజున కేవలం 90 లక్షల రూపాయల కలెక్షన్లను సాధించడం గమనార్హం.వైజాగ్ లో కూడా ఈ సినిమా కలెక్షన్లు ఆశాజనకంగా లేవు.

వారియర్ సినిమాతో రామ్ సక్సెస్ ట్రాక్ లోకి వస్తారని ఫ్యాన్స్ భావించగా అందుకు భిన్నంగా జరిగింది.అయితే ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది.

Telugu Kriti Shetty, Ram Track, Warrior, Days, Warrior Days-Movie

సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నా నిర్మాతలకు మాత్రం నష్టాలు వచ్చే అవకాశాలు అయితే దాదాపుగా లేనట్టేనని తెలుస్తోంది.రామ్ కు జోడీగా కృతిశెట్టి ఈ సినిమాలో నటించగా కృతిశెట్టి కెరీర్ లో తొలి ఫ్లాప్ గా ఈ సినిమా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయి.బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాతో రామ్ కోరుకున్న సక్సెస్ దక్కుతుందేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube