తెలంగాణ ఉద్యోగులకు 15 వతేదీ వచ్చినా జీతాలు పడే పరిస్థితి కనిపించడంలేదు.ఒకటో తీదీన వచ్చే జీతాల పరిస్థితి నుంచి 15వ తేదీవచ్చినా జీతాలు రాని పరిస్థితి వచ్చింది.
ఫించన్లు కూడా రాలేదు.నెలనెలా జీతాలు ఆలస్యంగా జమ అవుతున్నాయి.
దీంతో ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు.అయితే, ఈ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి టీఆర్ఎస్ మైండ్ గేమ్ మొదలు పెట్టిందా ? ఇందులో భాగంగానే సరికొత్త సర్వేలు తెరపైకి తెచ్చారా ? అవుననే అంటున్నారు విశ్లేషకులు.
ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు అకౌంటలలో జమకాలేదు.15వ తేదీ వచ్చినా జీతాలు రాకపోవడంతో ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.ఈఎంఐలు కట్టాల్సిన వారు ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.తెలంగారాష్ట్ర వ్యాప్తంగా 32 ప్రభుత్వ శాఖల పరిధిలో గెజిటెడ్ ఉద్యోగులు 30,403 మంది, నాన్ గెజిటెడ్ రెండు లక్షల 46 వేల 608 మంది, క్లాస్ 4 ఉద్యోగులు ముప్పే వేల మంది, మొత్తం ఉద్యోగులు మూడు లక్షల ఏడు వేల ఇరవై మూడు మంది ఉద్యోగులున్నారు.
రెండు లక్షల మంది పింఛన్ దారులు ఉన్నారు.ఉద్యోగులకు చాలా నెలలుగా జీతాలు ఆలస్యంగా అకౌంట్ లో జమ అవుతున్నాయి.
15వ తేదీ వచ్చినా జీతాలు జమకాలేదు.అప్పులతో రాష్ట్ర ఖజానా ఖాళీ కావడం, నెలనెలా వస్తున్న ఆదాయంలో సగం కు పైగా పైసలు వడ్డీలు కట్టేందుకే సరిపొతుంది అంటున్నారు ఉద్యోగులు.
కొన్ని నెలల నుంచి రాష్ట్రం లో ఒకటే రోజు అందరి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడిన రోజు లేదంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు.అయితే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పడే నాటికి మిగులు బడ్జెట్ రాష్ట్రం ఉండేది.అయితే ప్రభుత్వ వైఫల్యాలవల్ల దివాళా పరిస్థితికి వచ్చింది.4 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది.

ప్రభుత్వ ఉద్యోగులు తమ వ్యక్తిగత అవసరాల కోసం పెట్టుకున్న బిల్లులు కూడా సరైన టైమ్ కి రావడం లేదు.సరెండర్ లీవ్ ల బిల్లులు, సప్లిమెంటరీ బిల్లులకు కూడా అంతే లేట్ గా ఇస్తున్నారు.చాలా మంది ఉద్యోగులు అత్యవసరం ఉండి GPF లోన్ అప్లయ్ చేసుకుంటే అవి కూడా లేట్ గా ఇస్తున్నారని వాపోతున్నారు ఉద్యోగులు.
ఉద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం అనేక గిమ్మిక్కులు చేస్తోంది.ప్రజలను తప్పుదారి పట్టించడానికి రకరకాల రూపాల్లో మైండ్ గేమ్ ఆడుతోంది.
ఇప్పుడు తాజాగా సర్వేలు పేరుతో మరో అంశాన్ని తెరపైకి తెచ్చింది.ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని సర్వే వెల్లడించింది.
ఇది ఫేక్ సర్వే అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.టీఆర్ఎస్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇలా సర్వేల పేరుతో పబ్బంగడుపుతోందంటున్నారు.







