4 సినిమాలతో సత్తా చాటడానికి సిద్ధం అవుతున్న తమన్

సినిమాకు సంగీతం ఒక సోల్ లాంటిది.సంగీత బాగుంటే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని నానుడి ఎప్పటి నుంచో ఉంది సినిమా ఫ్లాప్ అయినా ఆ సంగీతంతో హిట్టు కొట్టిన సినిమాలు అనేకం ఉన్నాయి అందుకే తెలుగులో మ్యూజికల్ హిట్స్ ఎక్కువగా ఉన్నాయి.

 Thaman Movies 2022 Second Half Details, Thaman ,music Director Thaman, Thaman Mo-TeluguStop.com

అలా తన సంగీతంతో టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగిన తమన్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో రెండు చేతుల సంపాదిస్తున్నాడు.ఇక 2022 సంవత్సరానికి వస్తే మొదటి అర్థ భాగం కూడా పూర్తిగా తమన్ సినిమాలతోనే నిండిపోయింది.

సూపర్ మచ్చి, రాదే శ్యాం, డీజే టిల్లు, సర్కార్ వారి పాట, బీమ్లా నాయక్, గని ఇలా అన్ని సినిమాలకు తమన్ సంగీత దర్శకత్వం అందించి ఈ సినిమా సక్సెస్ లో ప్రముఖ పాత్ర పోషించాడు.ఈ సినిమాలన్నీ కూడా సంగీత పరంగా మంచి మార్కులు వేయించుకున్నాయి.2022 క్యాలెండర్ ఇయర్ ఈ సెకండ్ హాఫ్ వస్తే మళ్లీ తమన్ హవానే పూర్తిగా కనిపించనుంది.ప్రస్తుతం తమన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.

అక్కినేని నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమా జూలైలో విడుదల కానుంది.

Telugu Balakrishna, Chiranjeevi, God, Music Thaman, Naga Chaitanya, Prince, Tham

ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకత్వం అందించాడు.ఇక చిరంజీవి టైటిల్ రోల్ లో మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమా దసరాకి విడుదల కానుండగా ఈ చిత్రానికి సైతం తమనే సంగీత బాధ్యతలు తీసుకున్నాడు.

అనుదీప్ దర్శకత్వంలో శివ కార్తికే హీరోగా వస్తున్న ప్రిన్స్ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకి రానుంది.

Telugu Balakrishna, Chiranjeevi, God, Music Thaman, Naga Chaitanya, Prince, Tham

చిత్రానికి సైతం సంగీతం అందించడం విశేషం.నందమూరి నరసింహ బాలకృష్ణ నటిస్తున్న సినిమా కి ఇంకా పేరు ఖరారు కాలేదు.ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తుండగా ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో విడుదల కానుంది.

ఈ చిత్రం కూడా తమన్ చేతిలోనే ఉంది.మరో నాలుగు ఆసక్తికరమైన సినిమాలతో తమన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube