పెళ్లి సందడి హీరోయిన్ రవళి ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

1996లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వం లో విడుదలై మంచి సక్సెస్ అందుకున్న సినిమా పెళ్లి సందడి.

 Pelli Sandadi Actress Ravali And Minister Roja Visits Tirumala, Mla Roja, Pellis-TeluguStop.com

ఇందులో శ్రీకాంత్, దీప్తి భట్నాగర్, రవళి నటీనటులుగా నటించగా ఈ సినిమా వారికి మంచి సక్సెస్ అందించింది.ఇక ఇందులో రవళి మాత్రం తను ఎక్స్ప్రెషన్స్ తో తెలుగు ప్రేక్షకులను బాగా ఫిదా చేసింది.

ఒకప్పుడు ఈమె తన అందంతో ఎంతోమంది కుర్రాల హృదయాలను దోచుకుంది.

ఈమె తెలుగు ప్రాంతానికి చెందిన నటి.తెలుగుతో పాటు తమిళ సినిమాలలో కూడా నటించింది.ఈమె తొలిసారిగా ఆలీబాబా అరడజను దొంగలు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

ఆ తర్వాత రియల్ హీరో సినిమాలో నటించేగా అదే సమయంలో తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.ఇక 1996లో విడుదలైన పెళ్లి సందడి సినిమాతో మాత్రం మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

ఆ తర్వాత హిందీ, కన్నడ భాషలలో కూడా పలు అవకాశాలు అందుకుంది.ఇక చివరిగా 2006లో స్టాలిన్ సినిమాలో నటించి అందులో కూడా తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత మళ్లీ ఏ సినిమాల్లో కూడా కనిపించకపోగా పలు ఈవెంట్లలో మాత్రం దర్శనమిస్తుంది.ఇక ఈమె 2007లో నీలికృష్ణని వివాహం చేసుకుంది.

ఇక వీరికి ఒక కూతురు కూడా ఉంది.ఇక రవళి సోదరి హరిత కూడా టాలీవుడ్ బుల్లితెర నటి అన్న సంగతి మనకు తెలిసిందే.

Telugu Actress Ravali, Mla Roja, Pellisandadi, Tirumala, Tollywood-Movie

ఇక ఈమె కొన్నాళ్లు బుల్లితెరపై కూడా నటించింది.జెమినీలో ప్రసరమైన నమో వెంకటేశ సీరియల్లో నటించింది.ఇక ఈమె 2009లో తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.ఆ సమయంలో తమ పార్టీ తరఫున జోరు ప్రచారాలు కూడా చేసింది.ఇక రవళికి అప్సర, శైలజ అనే మరో రెండు పేర్లు కూడా ఉన్నాయి.చాలా వరకు ఈ పేర్లు ఎవరికీ తెలియవు.

మొదట్లో మంచి సక్సెస్ అందుకున్నా రవళి ఎందుకో ఆ సమయంలో అవకాశాలు అందుకోలేకపోయింది.దాంతో ఆమె పూర్తిగా సినిమాలకే బ్రేక్ ఇచ్చేసింది.మొత్తానికి సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాల వైపు అడుగులు పెట్టింది.కానీ ఇప్పుడు ఆమె ఒకప్పటిలా లేదనే చెప్పాలి.

ఒకప్పుడు తను ఎంతో అందంగా కనిపించేది.

కానీ ఇప్పుడు తన అందం మొత్తం పోయింది.

నిజానికి ఇప్పుడు ఆమె గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉందని చెప్పవచ్చు.ఎందుకంటే ఆమె చాలా లావు అయిపోయింది.

ఇటీవలే విడుదల అయినా పెళ్లి సందడి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా హాజరయ్యింది.కానీ తనని ఎవరు గుర్తుపట్టలేరు అని తానే చెప్పుకొచ్చింది.

తను ఎక్కువ బరువు కావడం వల్ల ఎవరు గుర్తుపట్టలేరేమో అంటూ ఫన్నీగా తెలిపింది.

ఇక ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

ఈరోజు ఆమె తిరుపతిలో మంత్రి రోజాతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.ఇక అందరూ రోజా ను చూస్తున్నారు తప్ప ఆమెను ఎవరు గుర్తుపట్టలేకపోయారు.కొందరు కాస్త గుర్తుపట్టగా ఇలా అయ్యింది ఏంటి అని షాక్ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube