శ్యాం ప్రసాద్ రెడ్డి వల్ల వారిద్దరి జీవితాలు మారిపోయాయి.. గీతాకృష్ణ కామెంట్స్ వైరల్!

గత కొద్ది రోజుల నుంచి మల్లెమాల వారి పేరు సోషల్ మీడియా వార్తలు పెద్ద ఎత్తున వినపడుతోంది.అందుకు గల కారణం జబర్దస్త్ కార్యక్రమంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఈ కార్యక్రమం నుంచి బయటకు పోయి ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమ నిర్వాహకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి కిరాక్ ఆర్పి చేసిన వ్యాఖ్యలే కారణమని చెప్పాలి.

 Director Geetha Krishna Comments About Shyam Prasad Goes Viral , Director Geetha-TeluguStop.com

ఒకప్పుడు జబర్దస్త్ కార్యక్రమం తనకు కన్నతల్లి లాంటిదని ఈ కార్యక్రమం గురించి ఎంతో గొప్పగా చెప్పిన కిరాక్ ఆర్పి ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమం గురించి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

ఈ క్రమంలోనే శ్యాంప్రసాద్ రెడ్డి గురించి ఈయన చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు డైరెక్టర్ గీతాకృష్ణ.

ఈటీవీ రేటింగ్ పూర్తిగా పడిపోయిన సమయంలో శ్యాంప్రసాద్ రెడ్డి జబర్దస్త్ కార్యక్రమాన్ని తీసుకువచ్చి ఈటీవీ రేటింగ్స్ పెంచడమే కాకుండా ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు.శ్యాం ప్రసాద్ రెడ్డి తాను ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకున్నామని ఆయన ఎలాంటి వారో నాకు తెలుసని తెలిపారు.

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఐరన్ లెగ్ అని పేరు వేయించుకున్న నాగబాబు రోజా వంటి వారి లైఫ్ కూడా మారిపోయాయి.అలాంటి పెద్ద సంస్థపై సాంబార్ బాగాలేదంటూ కామెంట్ చేయడం ఏంటి అని మండిపడ్డారు.

Telugu Geetha Krishna, Mallemala, Tollywood-Movie

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఆర్పి కూడా ఎంతో పేరు సంపాదించుకున్నారు కానీ ఈయన వల్ల జబర్దస్త్ కార్యక్రమానికి ఏమాత్రం ఉపయోగం లేదని గీతాకృష్ణ వెల్లడించారు.మల్లెమాల వారి సమస్త ఓ పెద్ద సంస్థ అక్కడ సాంబార్ బాగాదంటూ విమర్శలు చేయడం ఏంటి.ఆర్పీ ఓ గొట్టం అతను ఫుడ్ బాలేదంటేనే జబర్దస్త్ కార్యక్రమానికి మల్లెమాలవారికి చెడ్డ పేరు వస్తుందా… ఇలాంటి ఆరోపణల వల్ల శ్యామ్ కి వచ్చే నష్టమేమీ లేదంటూ గీతాకృష్ణ ఆర్పీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.ఈ క్రమంలోనే గీతాకృష్ణ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube