టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి యాంకర్ గా కెరియర్ ప్రారంభించి అనంతరం నటిగా ఎన్నో సినిమా అవకాశాలను అందుకొని ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కెరియర్ మొదట్లో ఈమె యాంకర్ గా పలు కార్యక్రమాలకు వ్యవహరించిన జబర్దస్త్ కార్యక్రమం ఈమెకు గుర్తింపు తీసుకువచ్చింది.
ఇకపోతే పలు సినిమాలలో నటించినప్పటికీ రంగస్థలం సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం అరడజనుకుపైగా సినిమాలను చేతిలో పెట్టుకున్నారు.
ఈ విధంగా ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వరుస బుల్లితెర కార్యక్రమాలకు కూడా కమిట్ అవుతున్నారు.
ఇకపోతే కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.సోషల్ మీడియా వేదికగా అనసూయ తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా అనసూయ తన లేటెస్ట్ క్యూట్ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయ్యాయి.

లేత గులాబీ రంగు గౌను ధరించిన అనసూయ చిందులు వేస్తూ చిలిపిగా ఫోటోలకు ఫోజులిచ్చారు.ఈ క్రమంలోనే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ డాన్సింగ్ మంకీ అంటూ క్యాప్షన్ జోడించారు.ఈ క్రమంలోనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
ఇకపోతే అనసూయ తనుకు లైఫ్ ఇచ్చినటువంటి జబర్దస్త్ కార్యక్రమానికి తాను గుడ్ బై చెప్పబోతున్నట్లు పరోక్షంగా వెల్లడించారు.ఈ విధంగా బుల్లితెర కార్యక్రమాలకు స్వస్తి పలికి పూర్తిగా సినిమాలు వెబ్ సిరీస్ లపై ఈ యాంకరమ్మ ఫోకస్ పెట్టబోతుందని తెలుస్తుంది.







