డైరెక్టర్ ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో ఈరోజు విడుదలైన సినిమా ది వారియర్. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మాతగా బాధ్యతలు చేపట్టాడు.
ఇందులో రామ్ పోతినేని, కృతి శెట్టి హీరో హీరోయిన్ గా నటించారు.అంతేకాకుండా ఆది పినిశెట్టి, అక్షర గౌడ, నదియా తదితరులు నటించారు.
ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ను అందించాడు.ఇక ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ భాషల్లో కూడా విడుదలైంది.
ఈ సినిమా విడుదల కాకముందే ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.దీంతో ఈ సినిమా ఈరోజు విడుదల కావడంతో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.అంతేకాకుండా రామ్, కృతి శెట్టి కి ఎటువంటి సక్సెస్ అందించిందో చూద్దాం.
కథ:
ఇక ఇందులో రామ్ సత్య అనే పాత్రలో కనిపిస్తాడు.అందులో ఆయన డిఎస్పీ ఆఫీసర్ గా పనిచేస్తాడు.కృతి శెట్టి విజిల్ మహాలక్ష్మి అనే పాత్రలో నటిస్తుంది.ఇక తాను ఆర్జే గా కనిపిస్తుంది.ఆది పినిశెట్టి గురు అనే పాత్రలో గ్యాంగ్ స్టార్ గా కనిపిస్తాడు.
ఇక డిఎస్పీ సత్య పేరు అని చెబితే రౌడీలంతా వణికి పోతారు.కానీ అదే సమయంలో సత్యకు కర్నూలు బదిలీ అవుతుంది.
ఇక కర్నూలులో గురు ఏది చెబితే అదే అన్నట్లుగా ఉంటుంది.ఆ సమయంలో సత్య మహాలక్ష్మి ని కలుస్తాడు.
ఇక మహాలక్ష్మి రేడియో జాకీ తో కర్నూలులో జరుగుతున్న చట్ట విరుద్ధ పనులను ఆపడానికి ప్రయత్నిస్తుంది.ఆ సమయంలో తనకు సత్య పోలీస్ ఆఫీసర్ అని తెలుస్తుంది.
ఆ తర్వాత గురు సత్య, మహాలక్ష్మిల గురించి తెలిస్తే ఏం చేస్తాడు అనేది.అంతేకాకుండా సత్య గురుని ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నాడు.
మహాలక్ష్మికి, ఊరికి మధ్య ఉన్న సంబంధం ఏంటి మిగిలిన కథలోనిది.

నటినటుల నటన:
రామ్, కృతి శెట్టి తమ పాత్రలతో బాగా ఆకట్టుకున్నారు.ముఖ్యంగా తమ మధ్య జరిగిన సన్నివేశాలు మాత్రం బాగా హైలైట్ గా నిలిచాయి.రామ్ తన ఫైటింగ్ తో ప్రేక్షకులను మరో స్థాయిలో మెప్పించాడు.
ఆది మాత్రం తన నటనతో మరో లెవల్ కి వెళ్ళాడు.మిగతా నటీనటులంతా తమ పాత్రకు పూర్తి న్యాయం చేశారు.
టెక్నికల్:
డైరెక్టర్ మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.పైగా నటీనటుల ఎంపిక కూడా పాత్రకు తగ్గట్టుగా ఆకట్టుకుంది.
సినిమాటోగ్రఫీ అద్భుతంగా.దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ మరోసారి ఆకట్టుకుంది.
ఎడిటింగ్ భాగాలు కూడా అద్భుతంగా ఉన్నాయి.

విశ్లేషణ:
ఇది ఒక పోలీస్ డ్రామా.మాస్, యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమా అద్భుతంగా ఉంది.ఇక సత్య, గురు మధ్యలో వచ్చే సన్నివేశాలు మాత్రం సినిమాకి బాగా హైలైట్ గా ఉన్నాయి.ఎమోషన్స్ ను కూడా అద్భుతంగా చూపించాడు దర్శకుడు.
ప్లస్ పాయింట్స్:
రామ్, ఆది మధ్య సన్నివేశాలు బాగా హైలైట్ గా ఉన్నాయి.యాక్షన్స్ అన్ని వేషాలు కూడా బాగా ఆకట్టుకున్నాయి.కృతి శెట్టి డాన్స్ కూడా అద్భుతంగా ఉంది.దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ బాగా ఆకట్టుకుంది.

మైనస్ పాయింట్స్:
సెకండాఫ్ లో కాస్త ల్యాగ్ అయినట్లు అనిపించింది.
బాటమ్ లైన్:
చివరిగా చెప్పాల్సిందేంటంటే.మాస్, యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు.







