ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి వినూత్నమైన ఆలోచనలతో పాలన అందిస్తున్న సంగతి తెలిసిందే.ఎక్కువగా విద్య మరియు వైద్యంపై దృష్టి పెడుతూ.వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.“నాడు నేడు” కార్యక్రమంలో మరియు కాలేజీలు ఇంకా హాస్పిటల్స్ రూపురేఖలు మార్చడం జరిగింది.అదే రీతిలో ఆరోగ్యశ్రీ పథకంలో కూడా అనేక మార్పులు చేయడం జరిగింది.ఇదిలా ఉంటే ఈ ఆగస్టు 15 తారీకు నుండి రాష్ట్రవ్యాప్తంగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని తీసుకురావడానికి సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
బుధవారం వైద్య ఆరోగ్య శాఖ పై సమీక్ష నిర్వహించిన జగన్ .ఆరోగ్యశ్రీ ద్వారా అందించే చికిత్సలను పెంచాలని సూచించారు.ఇదే సమయంలో ఆగస్టు మొదటి తారీకు నుండి పెంచిన చికిత్సలు అందుబాటలో ఉండేలా చర్యలు తీసుకోవాలని.ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ విధానాన్ని తీసుకురావాలని పేర్కొన్నారు.విలేజ్ క్లినిక్, PHC లకు డిజిటల్ వీడియో లింకేజ్ ఉండాలన్న జగన్.ప్రికషన్ డోస్ వ్యవధి తగ్గించినందున వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.