టాలీవుడ్ స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట చలో సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.
ఇక రష్మిక మందన్న కు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.ఇది ఇలా ఉంటే ఇటీవలే పుష్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక, ఈ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది.
కాగా రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా సినిమాల్లో నటిస్తూ కెరీర్ పరంగా దూసుకెళ్తోంది.
కాగా ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా తో కలిసిన నటించిన మిషన్ మజ్ను విడుదలకు సిద్దంగా ఉంది.అలాగే గుడ్‌బై అనే మరొక సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇటీవల రష్మిక కీ సంబంధించి పలు రకాల వార్తలు పెద్ద ఎత్తున వినిపించిన సంగతి మనందరికీ తెలిసిందే.అయితే అందులో నుంచి ఒక రూమర్ నిజమే అని తేల్చి చెప్పింది.
రష్మిక మందన్న, బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ కలిసి ఒక యాడ్‌లో కలిసి నటించింది.

దీనికి సంబంధించిన బూమరాంగ్ వీడియోను ఇన్‌స్టా వేదికగా పంచుకుంది రష్మిక.ఈ వీడియో పోస్ట్ చేస్తూ ఆ రూమర్లు నిజమే.చాలా నవ్వోస్తోంది.
నేను, టైగర్ ష్రాఫ్ ఒక యాడ్ కోసం కలిసి నటించాం.టైగర్ ష్రాఫ్‌తో కలిసి పనిచేయడం అద్భుతంగా ఉంది.
ఈ యాడ్ కోసం ఎదురుచూస్తున్నాను అని రాసుకొచ్చింది రష్మిక.రష్మిక చేసిన ట్వీట్ పై స్పందించిన టైగర్ ష్రాఫ్ షూట్ చేయడం సరదాగా ఉంది.
నువ్ ఎప్పటిలాగే అదరగొట్టావ్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.అయితే ముద్దుగుమ్మ రష్మిక నిజమని చెప్పిన రూమర్ ఇదన్నమాట.







