కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇటీవల ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనపై వర్చువల్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో సీఎం జగన్ తో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాన గోవర్ధన్ రెడ్డి, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకృతి సేద్యం మరియు అగ్రి ఇన్ఫ్రా ఫండ్ అంశాల్లో తీసుకుంటున్న నిర్ణయాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని అభినందించారు.
వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న చాలా కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ప్రేరణగా ఉన్నాయి అని కేంద్రమంత్రి తోమర్ స్పష్టం చేశారు.
ఈ క్రాపింగ్ విధానం ఇతర రాష్ట్రాలలో కూడా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకొచ్చారు.ఇప్పుడు మాత్రమే కాదు గతంలో కూడా కేంద్ర వ్యవసాయ శాఖ బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించి.
స్వయంగా వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్బికేలు.ఇంకా పలు విధివిధానాల పనితనాన్ని చూడటం జరిగింది.
ఆ సమయంలో కూడా సీఎం వైఎస్ జగన్ ని కేంద్ర బృందం అభినందించింది.కాక నేడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయం విషయంలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని పొగడ్తలతో ముంచేతారు.







