కెరటం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రకుల్ ప్రీతిసింగ్ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి హిట్ కొట్టారు.ఈ సినిమాతో మంచి విజయం అందుకున్న ఈ ముద్దుగుమ్మ అనంతరం తెలుగులో వరుస సినిమా అవకాశాలను అందుకున్నారు.
ఇలా తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన రకుల్ ప్రీతిసింగ్ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం హిందీ భాషలలో కూడా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇకపోతే తెలుగులో రకుల్ ప్రీతిసింగ్ కొండ పొలం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున నిరాశపరిచింది.
ఇకపోతే ఈ సినిమా తర్వాత రకుల్ ప్రీతిసింగ్ ఎలాంటి తెలుగు సినిమాలను ఇప్పటివరకు ప్రకటించలేదు.
అలాగే ఈమె హిందీలో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే రకుల్ ప్రీతిసింగ్ తెలుగు సినిమాల గురించి ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఈమె తెలుగు ఇండస్ట్రీకి దూరం అవుతుందా అని అభిమానులు భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇదే విషయం గురించి ఒక నెటిజన్ ఏకంగా రకుల్ ని ప్రశ్నించారు.

సోషల్ మీడియాలో ఎంతో ఆక్టివ్ గా ఉండే రకుల్ ప్రీత్ సింగ్ తరచూ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే తాజాగా అభిమానులతో ముచ్చటించిన ఈమెను ఒక నెటిజన్ ప్రశ్నిస్తూ.మీరు తెలుగు సినిమాలు చేస్తారా లేకపోతే బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ అక్కడే ఉండిపోతారా అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు రకుల్ ప్రీతిసింగ్ సమాధానం చెబుతూ తాను తెలుగులో సినిమాలు చేయకపోవడానికి ఓ కారణం ఉంది.ఎప్పుడు ఒకే తరహా పాత్రలు కాకుండా, విభిన్నంగా సరికొత్తగా చాలెంజింగ్ పాత్రలలో చేయాలని అనుకుంటున్నాను.
అలాంటి పాత్రల కోసమే ఎదురు చూడటం వల్ల తాను తెలుగు సినిమాలను ప్రకటించలేకపోతున్నానని అసలు విషయం తెలియజేశారు.







