బాలీవుడ్ రేంజ్ హీరో తెలుగులో ఉండటం అదృష్టం.. ఆ హీరో పై బ్రహ్మాజీ ప్రశంసల వర్షం?

రామ్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన చిత్రం దివారియర్.లింగు స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జులై 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 Tollywood Actorbrahmajicommentson Hero Ram Pothineni, Hero Ram, Actor Bramhaji,-TeluguStop.com

ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు.మొదటిసారి రామ్ ద్వి భాష చిత్రంలో నటిస్తున్నారు.

ఇక ఈ సినిమా జూలై 14న విడుదల కావడంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటించిన నటుడు బ్రహ్మాజీ ఈ సినిమా గురించి హీరో రామ్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

నాకు ఇష్టమైన దర్శకులలో లింగు స్వామి గారు ఒకరు ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా చూసినప్పటి నుంచి నేను అతనికి అభిమానిగా మారిపోయానని బ్రహ్మాజీ తెలిపారు.ఇక శ్రీనివాస చిట్టూరి గారితో తనకి ఎప్పటినుంచో పరిచయం ఉందని ఆయన రామ్ తో ఈ సినిమా చేస్తున్నారని తెలియగానే అతనిని కలిసినట్టు బ్రహ్మాజీ పేర్కొన్నారు.

ఇకపోతే హీరో రామ్ గురించి మాట్లాడుతూ బ్రహ్మాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ సినిమాలో రామ్ ఫర్ఫార్మెన్స్ చూసి ఆయనకు అభిమానిగా మారిపోయానని ఆయన తెలుగులో ఎంతో స్పష్టంగా డైలాగ్స్ చెప్పారు.

తమిళంలో అంతకన్నా అద్భుతంగా డైలాగ్ చెప్పారని ప్రతి ఒక్క షాట్ సింగిల్ టేక్ లో పూర్తి చేశారని బ్రహ్మాజీ పేర్కొన్నారు.

Telugu Bramhaji, Brahmaji, Directorslingu, Ram, Kriti Shetty, Tamil, Telugu, War

రామ్ ఎనర్జీ, డెడికేషన్ చూసి ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండాల్సిన నటుడు అని భావించాను.కానీ అలాంటి టాలెంట్ ఉన్న హీరో మన తెలుగు హీరో కావడం ఎంతో అదృష్టం అని బ్రహ్మాజీ హీరో రామ్ పై ప్రశంసల వర్షం కురిపించారు.సాధారణంగా తెలుగు తమిళ భాషలలో సినిమాలు చేస్తే తమిళంలో ఇతర ఆర్టిస్టులను తీసుకుంటారు కానీ లింగస్వామి గారు తమిళంలో కూడా తనకే అవకాశం ఇచ్చారని అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ప్రస్తుతం బ్రహ్మాజీ రామ్ గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube