ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలలో కెరీర్ తొలినాళ్లలో నటించిన సినిమాలు వరుస విజయాలను అందుకున్నాయి.లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఉదయ్ కిరణ్ వరుస విజయాలతో తన రేంజ్ ను పెంచుకుని అప్పట్లోనే కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదగడం గమనార్హం.
ప్రముఖ నటి సుధను ఉదయ్ కిరణ్ తల్లిలా భావించేవారనే సంగతి తెలిసిందే.
ఒక ఇంటర్వ్యూలో సుధ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఉదయ్ కిరణ్ ను తాను దత్తత తీసుకోవాలని భావించానని నా కొడుకు నన్ను వదిలి మరో దారి చూసుకున్నాడని ఆమె చెప్పుకొచ్చారు.ఉదయ్ కిరణ్ మానసిక వేదనకు గురి కావడం వల్లే చనిపోయాడని సుధ కామెంట్లు చేశారు.
ఉదయ్ కిరణ్ ను ఎవరు మానసిక వేదనకు గురి చేశారనే ప్రశ్నకు మాత్రం తాను సమాధానం చెప్పలేనని సుధ కామెంట్లు చేశారు.
కొందరు ఇబ్బంది పెట్టేవాళ్ల పేర్లను బయటపెడతారని మరి కొందరు ఆ పేర్లను రివీల్ చేయకుండా లోలోపల బాధపడతారని సుధ వెల్లడించారు.
ఎంతో బాధను అనుభవించడం వల్లే ఉదయ్ కిరణ్ చనిపోయాడని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం.ఉదయ్ కిరణ్ చనిపోవడానికి కొన్నిరోజుల ముందు నన్ను కలవడానికి ఆసక్తి చూపలేదని ఆమె చెప్పుకొచ్చారు.
ఉదయ్ ను దత్తత తీసుకుని ఉంటే పుత్రశోకం అనుభవించి ఉండేదానినని సుధ వెల్లడించారు.

ఉదయ్ చనిపోవడానికి కొన్నిరోజుల ముందు నా కాళ్లు పట్టుకుని ఒంటరిని అయిపోతున్నానని బాధ పడ్డాడని సుధ పేర్కొన్నారు.ఆ సమయంలో ఉదయ్ కిరణ్ తో వ్యాపారం పెట్టిస్తానని నేను చెప్పానని సుధ చెప్పుకొచ్చారు.ఒత్తిడికి గురి కావడం కూడా ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు ఒక కారణమని సుధ కామెంట్లు చేశారు.
సుధ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.







