మెగా డాటర్ శ్రీజ, భర్త కళ్యాణ్ దేవ్ ల వ్యవహారం అర్థం కాని పజిల్ లా ఉంది.అయితే కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం మెగా కాంపౌండ్ కి చెందిన వాడా?కాదా అన్న ప్రశ్న అందరిలో మదిలోను మెదులుతోంది.సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం శ్రీజ కళ్యాణ్ దేవ్ ల మధ్య నిజంగానే మనస్పర్ధలు వచ్చాయా? వారు విడిపోయారా? లేదంటే త్వరలో విడాకులు తీసుకోబోతున్నారా? ఈ ప్రశ్నలు అన్నింటికి సమాధానం తెలియాల్సి ఉంది.అయితే సోషల్ మీడియాలో వీరిద్దరిపై జోరుగా ప్రచారాలు కొనసాగుతున్నప్పటికీ ఇరు కుటుంబాలు ఈ విషయంపై స్పందించడం లేదు.

కానీ శ్రీజ, కళ్యాణ్ దేవ్ ల సోషల్ మీడియా ఖాతాలు చూస్తే వీళ్లిద్దరు విడివిడి గానే ఉంటున్నారు అన్న విషయం అర్థం అవుతోంది.అంతేకాకుండా మెగా ఇంట్లో జరుగుతున్న ఈవెంట్లకు సెలబ్రేషన్స్ కు కూడా కళ్యాణ్ దేవ్ హాజరు కావడం లేదు.మెగాస్టార్ ఫ్యామిలీ కూడా కళ్యాణ్ దేవ్ ని పట్టించుకోవడం లేదు.అంతేకాకుండా ఇటీవలే కళ్యాణ్ దేవ్ నటించిన సినిమా విడుదల అయినప్పటికీ ప్రమోషన్స్ కూడా చేయడం లేదు మెగా ఫ్యామిలీ.
కాగా ఇది ఇలా ఉంటే తాజాగా కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ ని రాసుకోచ్చారు.

తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా ఆ విషెస్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చాడు. హ్యాపీ బర్త్డే మామ్..
జీవితం ఒక్కోసారి ఎంతో కష్టంగా మారుతుంది.కానీ నీ ప్రేమ వల్లే వచ్చే శక్తితో వాటినింటిని ఎదుర్కొంటాను అన్న నమ్మకం నాకు ఉంది.
నాకు ఎల్లప్పుడూ సపోర్ట్ గా నిలుస్తున్నందుకు థాంక్స్.లవ్ యు సో మచ్ మా అంటూ కళ్యాణ్ దేవ్ తన తల్లి పై ప్రేమను కురిపించాడు.
ఇందుకు సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.కాగా కళ్యాణ్ దేవ్ కూతురు నివృత్తి పుట్టినరోజు సందర్భంగా కళ్యాణ్ దేవ్ కనీసం బర్త్ డే విషెస్ చెప్పినట్టుగా కూడా కనిపించడం లేదు







