ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈనెల 13వ తారీకు విశాఖపట్నంకు రెడీ అయ్యారు.వాహన మిత్ర లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ కార్యక్రమం కోసం సీఎం జగన్ విశాఖ వెళ్లబోతున్నారు.
జగన్ విశాఖ షెడ్యూల్ చూస్తే ఈ నెల 13వ తారీకు ఉదయం 10:30 గంటలకు విశాఖ విమానశ్రయానికి చేరుకుంటారు.ఆ తర్వాత 11:05 గంటలకు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానమందు చేరుకుని.అక్కడ పది నిమిషాల పాటు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు.
అనంతరం వైయస్సార్ వాహన మిత్రుల లబ్ధిదారులతో ఫోటో సెషన్ లో పాల్గొంటారు.ఇక తర్వాత ఉదయం 11:47 నిమిషాల నుండి 12 గంటల 17 నిమిషాల వరకు జగన్ ప్రసంగం ఉంటుంది.ప్రసంగం అనంతరం లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేస్తారు.
ఆ తర్వాత మధ్యాహ్నం 12:30 నిమిషాలకు విమానాశ్రయానికి చేరుకుంటారు.విమానాశ్రయంలోనే 12:55 నిమిషాల నుండి 1:15 నిమిషాల వరకు స్థానిక నాయకులతో సమావేశం అవుతారు.ఆ తర్వాత 1: 20 నిమిషాలకు గన్నవరం తిరిగి ప్రయాణం అవుతారు.సీఎం జగన్ రాక నేపథ్యంలో విశాఖలో ఇప్పటినుండే ప్రభుత్వ అధికారులు.
భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.







