సోషల్ మీడియా విస్తృతంగా వినియోగంలోకి వచ్చాక ఎన్నో ఆసక్తికర వీడియోలు ప్రత్యక్షం అవుతున్నాయి.ప్రపంచంలో ఎక్కడ ఏ ఆసక్తికర ఘటన జరిగినా సోషల్ మీడియా ద్వారా మనకు తెలిసిపోతోంది.
తాజాగా ఓ వీడియో నెట్టింట బాగా చక్కర్లు కొడుతోంది.కొమ్ములు తిరిగిన పొట్టేలు అవసరమైతే కొండనైనా ఢీకొడుతుందని పెద్దలు చెబుతుంటారు.
అయితే ఓ పొట్టేలు తనకున్న కొమ్ములతో విర్రవీగిపోయింది.రంకెలేస్తూ వెళ్లి ఏకంగా ఎద్దును ఢీకొంది.
అయితే దాని గర్వం మొత్తం ఒక్క క్షణంలోనే దిగిపోయింది.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
ఇటీవల కాలంలో జంతువులకు సంబంధించిన ఆసక్తికర వీడియోలు నెటిజన్లను అలరిస్తున్నాయి.వాటికి ప్రజల నుంచి విపరీతమైన స్పందన లభిస్తోంది.ఆ వీడియోలో ఓ పొట్టేలుకు బాగా కొమ్ములు ఉన్నాయి.తనకు ఉన్న కొమ్ముల విషయంలో దానికి బాగా గర్వం తలకెక్కింది.
తన స్థాయి ఏంటో తెలుసుకోకుండా ఏకంగా ఎద్దుతో ఘర్షణకు దిగింది.అంతెత్తున ఉండే ఎద్దుకు పౌరుషం ఏమీ తక్కువ కాదు.
దానికి ఉండే బలం ముందు నలుగురు మనుషులు కూడా సరిరారు.అలాంటిది ఆ పొట్టేలు మాత్రం ఎద్దును తన కొమ్ములతో ఢీకొట్టింది.
అయితే ఎద్దు దానికి కోలుకోలేని షాక్ ఇచ్చింది.ఆ ఎద్దు కూడా పొట్టేలును బలంగా ఢీకొంది.
ఒక్క దెబ్బతో ఆ పొట్టేలు నేలను కరుచుకుపోయింది.ఎద్దు గుద్దితే తిరిగి లేవలేకపోయింది.
పడిపోయి అలాగే ఉండిపోయింది.ఆ గొర్రెకు బాగా తిక్క కుదిరిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మరోసారి ఆ ఎద్దుకు ఎదురు తిరగదని పేర్కొంటున్నారు.ప్రస్తుతం నెట్టింట గొర్రె-ఎద్దు ఫైట్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.







