సీతారామం' నుండి ఈద్ ఉల్-అధా స్పెషల్ పోస్టర్: ఆఫ్రీన్ గా రష్మిక మందన్న శుభాకాంక్షలు

”సీతా రామం’ లో రష్మిక మందన్న పాత్రని హిజాబ్ ధరించిన లుక్ తో ఆమె పుట్టినరోజు కానుకగా గతంలో పరిచయం చేశారు.శ్రీరామ నవమి రోజున విడుదల చేసిన గింప్స్ లో యుద్ధంలో రామ్, సీత విజయం సాధించేలా అఫ్రీన్ గా రష్మిక కోరుకునేలా ఆసక్తికరంగా చూపించారు.

 Sita Ramam's Eid Ul-adha Special Poster Rashmika Mandanna Aka Afreen Extends Gre-TeluguStop.com

నేడు ముస్లిం సోదరుల పవిత్ర పండుగ ఈద్ ఉల్-అధా పర్వదినం సందర్భంగా.రష్మిక పాత్రకు సంబధించిన ప్రత్యేక పోస్టర్ విడుదల చేశారు.

హిజాబ్ ధరించిన రష్మిక మందన్న ఈద్ ఉల్-అధా శుభాకాంక్షలను తెలియజేస్తున్న ఈ పోస్టర్ ఈద్ పర్వదినానికి ప్రత్యేకంగా నిలిచింది.ఈ చిత్రంలో రష్మిక చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు, కాశ్మీరీ ముస్లిం అమ్మాయి అఫ్రీన్ గా కనిపించనుంది.

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ రామ్, సీతగా ఈ చిత్రంలో కనిపించనున్నారు.బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ కీలక పాత్ర పోషిస్తుండగా, అతని ఫస్ట్ లుక్ పోస్టర్ నిన్న విడుదలైంది.పోస్టర్‌లో సుమంత్ లుక్స్ కు విశేష స్పందన వచ్చింది.

”సీతా రామం’ సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ సినీ అభిమానులను సర్ ప్రైజ్ చేస్తోంది.1965 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌కి, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది.‘‘సీతా రామం’ ఎపిక్ క్లాసిక్ కాబోతుందనే అంచనాలని పెంచుతోంది.

టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని భారీ నిర్మిస్తోంది.ఈ క్లాసిక్ రొమాంటిక్ కు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్.విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.

ఆగస్ట్ 5న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube