టాలీవుడ్ టాప్ యాంకర్లలో ఒకరైన సుమ ప్రస్తుతం క్యాష్ షోకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారనే సంగతి తెలిసిందే.ఈ షోకు జెన్నీ, సుభాషిణి, బాలాజి, కృష్ణవేణి హాజరయ్యారు.
సుభాషిణి సుమా! నీ డ్రెస్ బాగుంది సుమా అని సుభాషిణి చెప్పగా ఆ మాటలకు సుమ మురిసిపోయారు.జెన్నీగారు పెళ్లికన్నా ముందు ఏదైనా ప్రేమకథ జరిగిందా అని అడిగితే అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఉన్నాయని సుభాషిణి చెప్పుకొచ్చారు.
జెన్నీ సుభాషిణితో మీ విషయాలన్నీ నాపై రుద్ది చెప్పకూడదని కామెంట్లు చేశారు.బాలాజీగారు మీ వయసెంత అని అడగగా 64 అని బాలాజీ చెప్పారు.సుమ వెంటనే ఉదయం ఎప్పుడు నిద్రలేస్తారు అని అడగగా 4.30 అని చెప్పారు.బాలాజీ అలా చెప్పిన వెంటనే సుమ కొంచెం దూరంగా ఉండండి అంటూ కామెంట్ చేశారు.ఆ తర్వాత బాలాజీ చాలా మంచోడమ్మ అంటూ కృష్ణవేణి చెప్పుకొచ్చారు.బాలాజీగారు మంచి వ్యక్తి అంటే జెన్నీగారు ఏమిటని సుమ కామెంట్లు చేశారు.

సుభాషిణి మాట్లాడుతూ నేను ఈరోజు ఈ విధంగా నిలబడ్డానంటే సుమ కారణమని ఆరు నెలలకు ఒకసారి సుమ మెడిసిన్స్ పంపిస్తుందని సుభాషిణి ఎమోషనల్ అయ్యారు.మళ్లీ మానవ జన్మ అంటూ ఉంటే సుమ నా కడుపున పాపగా పుట్టాలని సుభాషిణి అన్నారు.సుభాషిణి కామెంట్లు విని సుమ ప్రేమగా ఆమెను హగ్ చేసుకున్నారు.
సుమ చూపించిన ప్రేమను చూసి సుభాషిణికి సైతం కన్నీళ్లు ఆగలేదు.
సుమ బంగారు తల్లి అంటూ సుభాషిణి వెల్లడించారు.
ఈ నెల 16వ తేదీన ఈ ఎపిసోడ్ బుల్లితెరపై ప్రసారం కానుంది.సుమ చాలా గొప్ప వ్యక్తి అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
దేవుడు సుమకు మంచి హృదయాన్ని ఇచ్చాడని నెటిజన్లు పేర్కొన్నారు.మరి కొందరు నెటిజన్లు పాతవాళ్లనే క్యాష్ షోకు పిలవవద్దని కొత్తవారికి కూడా అవకాశం ఇవ్వాలని కామెంట్లు చేస్తున్నారు.







