వైసీపీ గౌరవాధ్యక్ష బాధ్యతల నుంచి వైఎస్ విజయమ్మ తప్పుకున్నారు.ఈ సందర్భంగా ఆమె వైసీపీ ప్లీనరీలో అధికారంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన చేశారు.
తాను తెలంగాణలో తన కుమార్తెకు మద్దతుగా నిలవనున్నట్లు ప్రకటించారు.అయితే ఏపీలో జగన్‌కు ఇకపై తల్లితో అవసరం లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఎందుకంటే గతంలో జగన్ జైలుకు వెళ్లినప్పుడు వైసీపీని ముందుండి నడిపించడంలో విజయమ్మ, షర్మిల ప్రముఖ పాత్ర పోషించారు.
ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల్లో జగన్ తన తల్లిని విశాఖ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయించారు.
అయితే ఆ ఎన్నికల్లో విజయమ్మ ఓటమి పాలయ్యారు.అయితే విశాఖలో విజయమ్మ ఓడిపోయినా మిగిలిన చోట్ల పార్టీ గెలుపునకు ఆమె ఎంతో కృషి చేశారు.
ఆమె ప్రభావం లేకుండా వైసీపీ రాజకీయం లేదు.ఆ ప్రభావం నుంచి వైసీపీ తప్పించుకునే వీలు లేదని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.
నాడు జగన్‌కు మద్దతుగా ఏపీలో ప్రచారంలో చేసిన విజయమ్మ.ఇప్పుడు షర్మిలకు అదే తరహాలో సహకరించేందుకు సిద్దం అయినట్లు ప్రచారం జరుగుతోంది.అందుకే ఏపీలో వైఎస్ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలిగా తప్పుకుని తెలంగాణ వైఎస్ఆర్‌టీపీ గౌరవాధ్యక్షురాలి పదవిని తీసుకోనున్నారని టాక్ నడుస్తోంది.

కొంతకాలంగా ఆమె జగన్‌కు కాకుండా షర్మిలకే ప్రాధాన్యం ఇవ్వడాన్ని కూడా కొందరు ప్రస్తావిస్తున్నారు.దీంతో జగన్ తన తల్లిని దూరం పెట్టాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేస్తున్నారు.
అటు ఏపీలో వైసీపీ బాధ్యతల నుంచి విజయమ్మ తప్పుకోడానికి కారణం ఏదైనా జగన్‌పై పూర్తి ప్రేమ ఉన్నా ఆమె రాజీనామా మాత్రం పార్టీపై ప్రభావం చూపనుంది.
తన కొడుకును మీ చేతుల్లో పెడుతున్నానంటూ ఆమె భావోద్వేగంతో చెప్పినా.రాజీనామా చేయడానికి బయటకు చెప్పే కారణం ఏదైనా ఆమె తీవ్ర సంఘర్షణకు లోనయ్యే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా వైఎస్ బంధు వర్గంలో మాత్రం ఈ ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.







