ద్రౌపది ముర్ముతో చంద్రబాబు సమావేశం అవుతారా?

ప్రస్తుతం దేశంలో రాష్ట్రపతి ఎన్నిక హడావిడి నడుస్తోంది.ఈ నేపథ్యంలో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ము తనకు మద్దతు కోరుతూ వివిధ రాష్ట్రాలలో పర్యటిస్తున్నారు.

 Will Chandrababu Meet Draupadi Murmu , Andhra Pradesh , Draupadi Murmu , Chandr-TeluguStop.com

ఇందులో భాగంగా ఆమె ఈనెల 12న ఏపీలో పర్యటించనున్నారు.కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఎలక్ట్రోరల్ కాలేజీ ప్రకారం అధికార పార్టీ వైసీపీకి ఉన్న 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేల విలువ 50 వేల వరకు ఉంటుంది.

అదే సమయంలో ప్రతిపక్ష పార్టీ టీడీపీకి ఉన్న ముగ్గురు ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేల విలువ చాలా తక్కువగా ఉంటుంది.

ఇప్పటికే ద్రౌపది ముర్ము నామినేషన్‌కు తాము మద్దతు ప్రకటిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది.

అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.ఆయన అటు ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇవ్వలేదు.

ఇటు విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించలేదు.ఈనెల 12న ఏపీ పర్యటనకు వస్తున్న ద్రౌపది ముర్ము సీఎం జగన్‌తో పాటు మిగిలిన ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు.

అయితే ఆమె చంద్రబాబుతో కూడా భేటీ అవుతారా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

నిజానికి టీడీపీకి ఉన్న ఓట్ల విలువ ఆధారంగా ఆ పార్టీ ద్రౌపది ముర్ముకు మద్దతు ఇచ్చినా, ఇవ్వకపోయినా ఒరిగేదేమీ ఉండదు.

కాకపోతే రాజ్యాంగబద్ధ పదవి కావడంతో అన్ని పార్టీల నుంచి మద్దతు సాధించాలన్నది ద్రౌపది ముర్ము కనీస బాధ్యత అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.మరి ముర్ము టీడీపీ అధినేత చంద్రబాబును కలుస్తారా.

కలిస్తే ఆయనతో ఏం చర్చిస్తారు అన్న విషయం ఆసక్తికరంగా మారింది.

Telugu Andhra Pradesh, Chandrababu, Chandrababumeet, Cm Jagan, Draupadi Murmu, Y

తెలుగు రాష్ట్రాల నుంచి వైసీపీ అధికారికంగా ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించింది.తొలుత సీఎం జగన్ నామినేషన్ కార్యక్రమానికి తొలుత హాజరు కావాలని భావించారు.కానీ చివరి నిమిషంలో ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారు.

వైసీపీ నుంచి పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి, లోక్ సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి ముర్ము నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.కాగా ద్రౌపది ముర్ము పర్యటన కార్యక్రమాన్ని కేంద్ర మంత్రులు గజేంద్రసింగ్‌ షెకావత్‌, కిషన్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షించనున్నారు.

పార్టీలకు అతీతంగా ప్రతి రాష్ట్రంలోని ఓటర్లను ముర్ము కలిసేలా వారు ప్రణాళికలు సిద్దం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube