కారుచౌకగా విమాన టికెట్లు.. విదేశాలనూ చుట్టేయొచ్చు!

సాధారణంగా ఈ రోజుల్లో అన్ని ఖర్చులూ రెట్టింపు అవుతున్నాయి.పప్పు, ఉప్పు నుంచి బంగారం వరకు ఏం కొనాలన్నా కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.

 Cheap Flight Tickets You Can Travel Abroad , Car , Fight Ticket , Bumper Office-TeluguStop.com

ఇక కూరగాయల ధరలైతే ఏం కొనేట్టు లేదు.ఏం తినేట్టు లేదు అన్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఇక పెరిగిన పెట్రోల్ రేట్లతో అన్ని ధరలపైనా ప్రభావం కనిపిస్తోంది.అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే భయపడాల్సి వస్తోంది.బస్సు ఛార్జీల నుంచి రైలు టికెట్లు, విమాన టికెట్ల వరకు అన్ని ప్రయాణాలు కష్టంగా మారాయి.ఇలాంటి పరిస్థితుల్లో రూ.26కే విమాన టికెట్లు వస్తున్నాయి.దీనికి సంబంధించి ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

వియత్నాంలో వియట్జెట్ అనే విమానయాన సంస్థ ఉంది.

అది ఇటీవల ఓ బంపరాఫర్ ప్రకటించింది.జులై 7 నుంచి 13 వరకు వారం పాటు గోల్డెన్ వీక్ ఆఫర్లను ప్రకటించింది.

ఏకంగా 7,77,777 టికెట్లను అందుబాటులో ఉంచింది.అవి కూడా రూ.26కే లభిస్తున్నాయి.అంటే వాటర్ బాటిల్ ధరకే విమాన టికెట్లను పొందుతున్నట్లు లెక్క.

ప్రస్తుతం పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.అయితే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్) ధరలు కూడా అదే స్థాయిలో పెరిగాయి.

అయినప్పటికీ విమాన ప్రయాణికులను ఆకర్షించేందుకు వియట్‌జెట్ ఏకంగా అతి తక్కువ ధరకే విమాన టికెట్లను ఆఫర్లలో అందించడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇండియా, జపాన్, ఇండోనేషియా సౌత్ కొరియాలకు వియాత్నం నుంచి రాకపోకలు సాగించవచ్చు.

మన దేశంలోనూ వియట్‌జెట్ సంస్థ సేవలు అందిస్తోంది.మరింకెందుకు ఆలస్యం.

మీరు విమాన ప్రయాణాలు చేస్తుంటే ఈ ఆఫర్‌ను అందిపుచ్చుకోండి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube