నేడు మన విద్యవస్థ ఏరీతిగ వున్నదో ఇక్కడ చెప్పాల్సిన పనిలేదు.దాదాపు గవర్మెంట్ చదువులు అటకెక్కుతున్నై.
ప్రజలు కార్పొరేట్ చదువులు కోసం పరుగెడుతున్న వేళ, చదువు తక్కువ.ఫీజులు ఎక్కువ మాదిరి వ్యవహరిస్తున్నాయి సదరు కార్పొరేట్ విద్యాసంస్థలు.
ఇలాంటి తరుణంలో కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన రీతిలో చదువులు బోధిస్తున్నారు.దానికి ఉదాహరణగా ఇటీవల ఇంగ్లీష్ మాట్లాడిన ‘బెండపాడు’ పాఠశాల విద్యార్థుల ప్రతిభ గురించి చెప్పుకోవచ్చు.
ప్రభుత్వ పాఠశాలలో చదువులు కనుమరుగుతున్నవేళ ఇక్కడి విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఆ పాఠశాల తీరుని ఏకంగా మన ఏపీ సీఎం కొనియాడారు.
ఇక్కడ కూడా అలాంటి ఓ వినూత్న కార్యక్రమం చేపట్టారు.
ఢిల్లీ ప్రభుత్వం, అక్కడి ప్రభుత్వ పాఠశాలలో ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు ఏమి చేస్తున్నారో, తరగతి గదులలో ఏ సబ్జెక్ట్ బోధిస్తున్నారో అని తల్లిదండ్రులకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో తరగతి గదులలో సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేసే ప్రాజెక్ట్‌ను అమలు చేస్తోంది.
సదరు పిల్లల తల్లిదండ్రులు లైవ్ లో చూసే విధంగా వీడియో ఫుటేజీ లింక్‌ను అందజేస్తామని అధికారులు తెలిపారు.ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం 2019లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో CCTV కెమెరాలను అమర్చాలని, తల్లిదండ్రులకు తరగతి గదుల ప్రత్యక్ష ఫీడ్‌ను అందించాలని నిర్ణయించింది.

దీని వెనుక ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ఇదే.తమ పాఠశాలల్లో చదివే విద్యార్థుల భద్రతను పెంచడమేకాకుండా, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన చదువు లభిస్తోంది అని చెప్పడమే.అలాగే ఇలాంటి ఓ చర్య కారణంగా సదరు స్కూల్స్ యాజమాన్యం కూడా అప్రమత్తంగా పనిచేస్తారని యోచిస్తోంది.ఇక ఈ లైవ్ CCTV వీడియో ఫుటేజీని అందుబాటులో ఉంచడానికి, తల్లిదండ్రులకు వ్యక్తిగత IDలు, పాస్‌వర్డ్‌లతో వ్యక్తిగత సురక్షిత లాగిన్ ఆధారాలు ఇవ్వబడతాయని అధికారులు తెలిపారు.







