నీలి రంగులో వున్న ఆకాశం వాతావరణ మార్పులకు అనుగుణంగా తెలుపుగాను, నలుపుగాను మారడం మనకు తెలిసిందే.ముఖ్యంగా వర్షాలు పాడేటప్పుడు నల్లని కారు మబ్బులను అలుముకుంటుంది ఆకాశం.
అప్పుడు ఆకాశం మొత్తం నల్లని రంగులో ఉంటుంది.ఇక మామ్మూలు సమయంలో తెలుపు రంగులో ఉంటుంది.
ఇది సర్వసాధారమైన విషయం.అయితే తాజాగా ఒకచోట ఆకాశం పచ్చ రంగులోకి మారింది.
అది చూసి ప్రజలు ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు.వెంటనే దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి కాస్త వైరల్ అవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే, USలో చోటు చేసుకున్న ఈ వింత ఘటన స్థానికంగా చర్చకు దారితీసింది.తాజాగా అక్కడ ఎన్నడూ లేని విధంగా ఆకాశం సరికొత్త రంగును పులుముకుంది.
అయితే ఆకాశం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇలా పచ్చ రంగులోకి మారింది.ఇది చూసిన పలువురు అధికారులు సైతం విస్తు బోయారు.
ఇక తాజాగా అక్కడ భారీ తుఫాను కారణంగా ఎలాంటి విపత్తులు జరిగాయో అందరికీ తెలిసినదే.అయితే దాని తర్వాత ఏర్పడిన ఈ పరిణామాలకు అక్కడి ప్రజలు కాస్త భయబ్రాంతులకు గురిఅవుతున్నారు.
తాజాగా USలోని సియోక్స్ ఫాల్స్, సౌత్ దకోటా ప్రాంతాల్లో భారీ తుఫాను వచ్చిన సంగతి అందరికీ తెలిసే ఉంటుంది.అయితే ఆ తుఫాను అనంతరం ఆకాశమంతా ఇలా ఆకుపచ్చ రంగులోకి మారిపోయింది.దీనిపైన స్పందించిన అధికారులు ఆకాశం ఇలా మారడం తామెన్నడూ చూడలేదని చెబుతున్నారు.కానీ జాతీయ వాతావరణ శాఖ వారు మాత్రం సాయంత్రం సమయంలో ఉండే ఎర్రని సూర్య కిరణాలు తుఫానులోని నీరు, ఐస్ అణువులతో చర్య జరిపినప్పుడు ఇలా మేఘాలు ఆకుపచ్చ రంగులో మెరుస్తాయని, దీని వలన భయపడాల్సిన అవసరం లేదంటూ ప్రకటన చేసారు.
దాంతో అక్కడి స్థానికులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.