కోడి కూర అంటే ఎవరికి చేదు? మనలో ప్రతి ఒక్కరికి చికెన్ అంటే బహుప్రీతి.అందుకే మన దేశంలో రకరకాల కోళ్లను ఆహారం కోసం పెంచుతూ వుంటారు.
అయితే ఇవి దాదాపుగా సాధారణ బరువుతోనే ఉంటాయి.ఇక్కడ నాటు కోడి అయినా, బాయిలర్ కోడి అయినా గరిష్టంగా 2 లేదా 3 కిలోల బరువు ఉంటాయి.
ఇక గిరిరాజు లాంటి ప్రత్యేక రకానికి చెందినవి అయితే 3-4 కిలోలు బరువు ఉంటాయి.ఇలాంటి కోళ్లను మనం తరచూ చూస్తూనే ఉంటాం.
అయితే వీటన్నింటికి మించిన కోళ్లు ఈ ప్రపంచంలో వున్నాయి.అవి దాదాపు 3 అడుగుల ఎత్తుని కలిగి ఉంటాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద కోడిగా ఇది అనధికారికంగా పిలవబడుతోంది.
ఈకోళ్ళు ముఖ్యంగా యూరప్ ఆగ్నేయాన ఉన్న కొసావోలో మనకు కనిపిస్తాయి.
వీటిని బ్రహ్మ కోడి పుంజులుగా అభివర్ణిస్తారు.దాదాపు 3 అడుగుల ఎత్తున్న ఈ కోళ్లు చూడటానికి భీకరంగా ఉంటాయి.
దాని రెక్కలు, కాళ్లు సైజు చాలా పెద్దగా ఉంటుంది.ఇక వీటి బరువు విషయానికొస్తే, 7.7 కేజీల వరకు వుంటాయని చెబుతున్నారు.కొన్ని బ్రహ్మ జాతి కోళ్లు 10 కేజీల వరకు బరువుని కలిగి ఉంటాయి.
ఇంత బరువు ఉన్నా కూడా ఈ కోడి సునాయాసంగా నడుస్తోంది.కావాలంటే ఇక్కడ వున్న వీడియో చూడండి.

ప్రస్తుతం ఈ కోడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.ఇది పాత వీడియో అయినప్పటికీ ఇన్‌స్టాగ్రామ్ పేజీ animals.hilariousలో బుధవారం పోస్ట్ చేయడంతో వెలుగు చూసింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు.ఈ వీడియోకి ఇప్పటికే 8 లక్షలకు పైగా వ్యూస్ రాగా.39 వేలకు పైగా లైక్స్ రావడం గమనార్హం.వీడియో చూసిన నెటిజన్లు.ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కోడి, ఇలాంటి కోడిని మేము ఎప్పుడూ చూడలేదు.అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మీరు కూడా ఓసారి తిలకించి అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.







