టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు.
కాగా ప్రభాస్ కి టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలో ఉందో మనందరికీ తెలిసిందే.బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఆ తర్వాత నటిచ్చిన సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.
ఇది ఇలా ఉంటే ప్రభాస్ హీరోగా నటించిన సాహో,రాధే శ్యామ్ సినిమాలో వరుసగా ప్లాప్ అవడంతో ప్రభాస్ ఇమేజ్ పై కాస్త ప్రభావం పడింది.
భారీ అంచనాల నడుమ విడుదలైన రాధేశ్యామ్ సినిమా ఊహించని విధంగా పరాజయం పాలవడంతో అభిమానులు నిరాశ చెందారు.
కాగా సాహో సినిమా హిందీలో పర్వాలేదు అనిపించినప్పటికీ తెలుగులో మాత్రం ఊహించని విధంగా ఫ్లాప్ అయ్యింది.ఆ తర్వాత భారీ అంచనాల నడుమ విడుదలైన రాధే శ్యామ్ సినిమా తెలుగుతో పాటు,హిందీలో కూడా పరాజయం పాలయిన విషయమా తెలిసిందే.
m తాజగా గత ఆదివారం రాధే శ్యామ్ సినిమాను తొలిసారి జీ తెలుగులో ప్రీమియర్ ప్రదర్శించారు.ఈ చిత్రాన్ని జీ బుల్లితెరపై గట్టిగానే ప్రమోట్ చేసింది.భీమవరంలో రాధే శ్యామ్ థీమ్ పార్క్ పేరుతో ప్రచారాలు కూడా చేసారు.

దీనితో ఈ సినిమా ప్రీమియర్ షోను చూడడం కోసం ప్రభాస్ అభిమానులు భారీ ఎత్తున తరలివస్తారని శాటిలైట్ ఛానెల్ యాజమాన్యం అంచనా వేసింది.తద్వారా మంచి టీఆర్పీ నెంబర్ కూడా సొంతం చేసుకోవచ్చని సదరు ఛానెల్ బోలెడన్ని ఆఆశలు పెట్టుకున్నప్పటికీ కానీ ఈ సినిమా బుల్లి తెరపై కూడా పెద్దషాక్ ఇచ్చింది.కాగా బుల్లితెర ప్రేక్షకులను కూడా రాధేశ్యామ్ సినిమా కూడా ఆకట్టుకోలేకపోయిందని టీఆర్పీని బట్టే తెలుస్తోంది.రాధే శ్యామ్ మొదటి సారి ప్రీమియర్ కోసం 8.25 టీఆర్ పీ దక్కింది.అయితే ఇంతకుముందు వకీల్ సాబ్, బంగార్రాజు నెంబర్ టీఆర్పీతో బుల్లి తెర ప్రేక్షకుల్ని అలరించడంలో ముందు వరుసలో ఉన్నాయి.వాటిని రాధేశ్యామ్ బీట్ చేస్తుందని టీమ్ అంచనా వేసింది.
కానీ రాధే శ్యామ్ కంటే ఆ రెండు చిత్రాలు మంచి ఫలితాలు సాధించినట్లు తెలుస్తోంది.







