చాలా మందికి పెంపుడు జంతువులు ఇంట్లో ఉండడం చాలా ఇష్టం.దీంతో కొందరు కుక్కలు, పిల్లులు, పక్షులను పెంచుకుంటుంటారు.
అయితే వాటిని ఇంట్లో మనుషులతో సమానంగా పెంచుతుంటారు.ఒక్కోసారి వాటికి ఏమైనా అయితే నానా హైరానా పడిపోతారు.
తమకు దెబ్బ తగిలినా తట్టుకుంటారు కానీ, పెంపుడు జంతువులకు ఏమైనా అయితే చాలా బాధ పడతారు.అంతలా వాటితో బంధం పెనవేసుకుపోతుంది.
ముఖ్యంగా పెంపుడు శునకాల విషయంలో ఇలా ఉంటుంది.ఎంత ముద్దు చేసినా, అవి ఒక్కోసారి చెప్పిన మాట అస్సలు వినవు.
చాలా విసిగిస్తాయి.
తాజాగా నెట్టింట వైరల్ అయిన ఓ వీడియోలో ఓ పెంపుడు కుక్క తన యజమానిని బాగా విసిగించింది.
దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.ఇటీవల ట్విట్టర్‌లో ఓ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.
స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టేందుకు ఓ వ్యక్తి వెళ్లాడు.తాను కూడా ఈత కొడతానంటూ అతడి పెంపుడు శునకం కూడా అందులోకి దూకింది.
అతడు దానిని పట్టుకునేందుకు ప్రయత్నించినా జారి పోయేది.ఇలా అతడిని బాగా విసిగించింది.

చివరికి అతడు ఆ కుక్కను పట్టుకుని, స్విమ్మింగ్ పూల్ బయటకు విసిరేస్తాడు.అయినా ఆ కుక్క స్విమ్మింగ్ పూల్ లోపలికి వచ్చేందుకు బాగా యత్నిస్తుంది.చివరికి తన యజమానిని తప్పించుకుని స్విమ్మింగ్ పూల్‌లోకి దూకేస్తుంది.ఇలా యజమాని వద్దంటున్నా, ఆ పెంపుడు శునకం బాగా విసిగించిన వీడియో నెటిజన్లకు నవ్వులు పూయిస్తోంది.చాలా గారాబం చేసినట్లు కనిపిస్తోందని, అందుకే అది మాట వినడం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.







