యాదాద్రి జిల్లా:జిల్లాలో ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏవో నాగేశ్వరచారికి సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో మెమోరండం అందజేశారు.అనంతరం సీపీఐ నేతలు మాట్లాడుతూ జిల్లాలో కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూల్ చేయడం మరియు పుస్తకాల ధరలు నిర్ణయించకుండా సామాన్య మధ్యతరగతి ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ విషయంలో విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్టుగా ఉంటున్నారని ఆరోపించారు.ఇప్పటికైనా ప్రైవేట్, కార్పొరేట్ మరియు యాదాద్రి భువనగిరి జిల్లాలో గుర్తింపు లేని పాఠశాలలపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు.
పుస్తకాలు,టై,బెల్టు,నోట్ బుక్స్ అమ్ముతున్న విద్యాసంస్థల పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా ప్రైవేట్ విద్యా సంస్థలలో విద్య హక్కు చట్ట ప్రకారం 20 శాతం నిరుపేద విద్యార్థులకు ఫీజు రాయితీ కల్పించాలని,కానీ,ప్రైవేటు విద్యాసంస్థలు కేజీ నుండి 10 వ తరగతి వరకు ఎల్ కె జి 15వేల రూపాయల నుండి 20వేల వరకు మరియు 10వ తరగతికి 50 వేల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
దీనివల్ల నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రులు, మధ్యతరగతి కుటుంబాలు అప్పుల పాలవుతున్నారని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏషాల అశోక్,సీపీఐ పట్టణ కార్యదర్శి పుట్ట రమేష్ గౌడ్,సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి చింతల మల్లేశం.
పట్టణ కార్యవర్గ సభ్యులు బేద్రమైన వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.







