గత రాత్రి నుండి చింతమనేని ప్రభాకర్ నీ పట్టుకోవడానికి తెలంగాణ పోలీసులు మూడు బృందాలుగా గాలింపులు చేపడుతున్నారు.హైదరాబాద్ శివారు ప్రాంతం పటాన్ చెరులో ఒక మామిడి తోటలో చింతమనేని ప్రభాకర్ తో పలువురు నాతో కొద్దిరోజుల నుండి కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందటం జరిగింది.
దీంతో పోలీసుల ఆకస్మిక దాడిలో చింతమనేని ప్రభాకర్ పరారు కావడం జరిగింది.అయితే చింతమనేని ప్రభాకర్ పై సభ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
అయితే ఈ వార్త రాత్రి నుండి వస్తూ ఉండటంతో తనపై రాజకీయ కక్షతోనే… తప్పుడు రాతలు రాస్తున్నారని, రాజకీయ కుట్ర జరుగుతుందని సోషల్ మీడియా వేదికంగా తనపై గత రాత్రి నుండి వస్తున్న వార్తలను ఖండించారు.అసలు పటాన్ చెరులో కోడిపందాలకు తనకి సంబంధం లేదు అని పేర్కొన్నారు.
ఇటువంటి తరుణంలో పటాన్‌చెరువు పోలీసులు.తమ దాడికి ముందుకు అక్కడ చింతమనేని ప్రభాకర్ ఉన్నారు అనడానికి ఇదీ సాక్షం అంటూ ఓ వీడియో విడుదల చేశారు.
చింతమనేని ప్రభాకర్ తో సహా మరి కొందరు ఈ పందేలను నిర్వహిస్తున్నట్లుగా అంతకు ముందే పేర్కొన్న పోలీసులు.ఈ వీడియోను విడుదల చేశారు.ఈ వీడియోలో కోడి పందాలు నిర్వహిస్తున్న ప్రాంతం నుండి పోలీసుల దాడి సమయంలో అక్కడి నుండి వెళ్లిపోతున్న చింతమనేని దృశ్యాలు కనిపిస్తున్నాయి.దీంతో వీడియోలో చింతమనేని అడ్డంగా బుక్ అయినట్లు పరిస్థితి మారింది.







