బుట్ట బొమ్మ పూజా హెగ్దే జోరు ఓ రేంజ్ లో కొనసాగుతుంది.తెలుగులో సూపర్ ఫాం లో ఉన్న అమ్మడికి బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు వస్తున్నాయి.
వీటితో పాటుగా కోలీవుడ్ లో కూడా పూజా వరుస అవకాశాలు అందుకుంటుంది.ఈమధ్యనే కోలీవుడ్ లో దళపతి విజయ్ సరసన బీస్ట్ సినిమా చేసింది పూజా హెగ్దే.
ఆ సినిమా పెద్దగా సక్సెస్ అవకపోయినా సరే కోలీవుడ్ లో అమ్మడికి మరో లక్కీ ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది.కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా సక్సెస్ ఫుల్ డైరక్టర్ శివ డైరక్షన్ లో ఓ సినిమా వస్తుంది.
ప్రస్తుతం సూర్య బాల డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు.అది పూర్తి చేశాక శివ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.సూర్య, శివ కాంబో సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దేని ఫిక్స్ చేశారట.తమిళంలో మొదటి సినిమా మూగముడి చేసిన పూజా హెగ్దే ఆ సినిమా తర్వాత మళ్లీ 10 ఏళ్ల తర్వాత బీస్ట్ చేసింది.
ఇక ఇప్పుడు బీస్ట్ తర్వాత వెంటనే సూర్యతో ఛాన్స్ అందుకుంది.ఇకమీదట తమిళంలో కూడా వరుస సినిమాలు చేయాలని చూస్తుంది పూజా హెగ్దే.

పూజా హెగ్దే సినిమాలో ఉంది అంటే గ్లామర్ విషయంలో డౌట్ పడాల్సిన విషయమే లేదు.అమ్మడు కూడా ఆ విషయంలో చాలా కోపరేట్ చేస్తుంది.అందుకే రెమ్యునరేషన్ కొద్దిగా ఎక్కువైనా సరే పూజాని చూడటానికి వచ్చే సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందని ఆమెని హీరోయిన్ గా తీసుకుంటున్నారు. ఈమధ్య తన అభినయంతో కూడా అమ్మడు మెప్పిస్తుంది కాబట్టి ఆమెకు మంచి అవకాశాలు వస్తున్నాయి.
ఇక తెలుగులో ఆల్రెడీ సూపర్ స్టార్ మహేష్, త్రివిక్రం కాంబో సినిమాలో ఛాన్స్ అందుకుంది పూజా.దీనితో పాటుగా విజయ్ దేవరకొండ జన గణ మన సినిమాలో కూడా నటిస్తుంది అమ్మడు.