హెయిర్ గ్రోత్ లేకపోవడం.ప్రస్తుత రోజుల్లో పెద్దల్లోనే కాదు పిల్లల్లో సైతం ఈ సమస్య కనిపిస్తోంది.
పోషకాహార లోపం, తగినంత నీరు తీసుకోకపోవడం, కాలుష్యం, తరచూ స్మార్ట్ ఫోన్స్‌తో గడుపుతూ నిద్రను నిర్లక్ష్యం చేయడం వంటి రకరకాల కారణాల వల్ల పిల్లల్లో హెయిర్ గ్రోత్ తగ్గిపోతుంటుంది.ఈ జాబితాలో మీ పిల్లలు ఉన్నారా.? అయితే అస్సలు టెన్షన్ పడకండి.ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీని ట్రై చేస్తే మీ పిల్లల జుట్టు ఒత్తుగా మరియు పొడవుగా పెరగడం ఖాయం.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా రెండు అవకాడో పండ్లను తీసుకుని సగానికి కట్ చేయాలి.
ఇలా కట్ చేసిన పండ్లలో గింజ తొలగించి.లోపల ఉండే పల్ప్‌ను సపరేట్ చేసుకోండి.
అలాగే మరోవైపు కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలను తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసి.కొబ్బరి పాలను వేరు చేయాలి.
ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో అవకాడో పల్ప్, అర కప్పు కొబ్బరి పాలు, వన్ టేబుల్ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ పిల్లల జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్‌ను పెట్టాలి.గంట లేదా గంటన్నర తర్వాత మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చని నీటితో హెయిర్ వాష్ చేయండి.వారంలో కేవలం ఒకే ఒక్కసారి ఈ రెమెడీని ట్రై చేశారంటే మీ పిల్లల జుట్టు ఒత్తుగా మరియు పొడవుగా పెరుగుతుంది.
హెయిర్ ఫాల్, హెయిర్ డ్యామేజ్, డ్రై హెయిర్ వంటి సమస్యలు ఉంటే.వాటిని నుండీ ఉపశమనం లభిస్తుంది.ఈ రెమెడీని పెద్దలు సైతం ప్రయత్నించవచ్చు.