శోభన్ బాబు పిలిచి హీరో అవకాశం ఇస్తే వద్దు అని చెప్పింది ఎవరో తెలుసా ?

అది 1973 వ సంవత్సరం.శోభన్ బాబు తన సినిమాలతో బిజీగా ఉన్న సమయం.

ఆయన హీరోయిన్ శారదతో శారద అనే ఒక సినిమాలో హీరోగా నటిస్తున్న సమయంలో రాజమండ్రి కి షూటింగ్ పని మీద వెళ్లి వెళ్లారు.అక్కడ హోటల్లో బస చేస్తున్న శోభన్ బాబు దగ్గరికి ఒక కుర్రాడు వచ్చాడు.

అతడితోపాటు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ అలాగే సినిమా ఇండస్ట్రీకి చెందిన క్రాంతి కుమార్ గారు కూడా ఉన్నారు.సరదాగా వెళ్లి శోభన్ బాబుని చూసేద్దాం రమ్మంటూ ఆ కుర్రాడిని తీసుకొని హోటల్ రూమ్ కి వెళ్ళారట.

దాంతో శోభన్ బాబు ఆ కుర్రాడిని ఎగాదిగా పైనుంచి కింద వరకు చూసి నువ్వెందుకు సినిమాలో హీరోగా ప్రయత్నించడం లేదు అని అడిగారట.దాంతో ఆ సదర్ వ్యక్తి నాకు ఇష్టం లేదండి నేను బిజినెస్ చేసుకుంటున్నాను నాకు బిజినెస్ అంటేనే ఇష్టం సినిమాల్లో నటించాలనే కోరిక లేదు నా మిత్రులంతా సినిమాల్లోనే ఉన్నప్పటికీ నాకెందుకు అటువైపు వెళ్ళాలని ఆసక్తి కలగలేదు అని సున్నితంగా నో చెప్పారట.

Advertisement

అలా శోభన్ బాబు అడిగినా కూడా సినిమాల్లోకి రావడానికి ఇష్టపడని ఆ కుర్రాడు మరెవరో కాదు.రాజబాబు, రాజబాబు అంటే కమెడియన్ రాజబాబు కాదు.

హీరో రాజబాబు ఇంతకి హీరో రాజా బాబు ఎవరు అనుకుంటున్నారా ? అదేనండి మన మురళీమోహన్ గారే.నటుడు మురళీమోహన్ అసలు పేరు రాజబాబు.

సినిమాల్లోకి వచ్చిన తర్వాత మురళీమోహన్ గా మారిపోయింది.అలాగే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, క్రాంతి కుమార్ ఫోర్స్ చేయడంతో సినిమా ఇండస్ట్రీలోకి ఎలాగోలా అడుగు పెట్టాడు.

అదే సంవత్సరం 1973లో ఆలా తన మొదటి సినిమాకి ఆడిషన్ ఇవ్వడానికి బలవంతంగానే మురళీమోహన్ ని తీసుకెళ్లారట క్రాంతి కుమార్ గారు.అక్కడికి వెళ్లాక అప్పటికే గిరిబాబు హీరోగా సెలెక్ట్ చేసినప్పటికీ మురళీమోహన్ లుక్స్ నచ్చడంతో గిరిబాబు ని విలన్ గా మార్చేసి మురళీమోహన్ ని హీరోగా తీసుకున్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

దీనికి గిరిబాబు సైతం ఓకే చెప్పడంతో ఇక మురళీమోహన్ మొదటి సినిమా ఖరార్ అయిపోయింది.ఆ సినిమా జగమే మాయ, ఈ సినిమాలో విజయ లలిత హీరోయిన్ గా నటించగా, ఈ సినిమా విడుదలై యావరేజ్ చిత్రంగా మిగిలినప్పటికీ ఆ తర్వాత రోజుల్లో మురళీమోహన్ ఒక స్టార్ హీరోగా ఎదిగారు.

Advertisement

ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఒక రిచెస్ట్ హీరోగా ఇప్పటికీ ఆయన పేరు సుస్థిరం చేసుకున్నారంటే కారణం కేవలం శోభన్ బాబు గారే అని చెప్పచ్చు.

ఇలా మురళి మోహన్ సినిమా ఇండస్ట్రీకి రావడానికి ఊతమిచ్చిన శోభన్ బాబు, ఆ తర్వాత రోజుల్లో డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా డబ్బులను కాపాడుకోవాలి అంటూ మురళీమోహన్ కి ఎప్పటికప్పుడు తన గైడెన్స్ ఇస్తూనే వచ్చారు.ఇలా శోభన్ బాబు పుణ్యమా అని మన ఇండస్ట్రీకి ఒక గొప్ప వ్యాపారవేత్తతో పాటు మంచి నటుడు కూడా దొరికాడు.ఆ తర్వాత మురళీమోహన్ నటన నుంచి విరామం తీసుకుని రాజకీయాల్లో కూడా బిజీ అయ్యారు ప్రస్తుతం రాజకీయాల్లో కూడా కాస్త వెనుక పడ్డట్టుగా ఉన్న ఆయన తన రిటైర్మెంట్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

తాజా వార్తలు