రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి కోటాలో దేశానికి ఎన్నో సేవలు అందించిన వారికి రాజ్యసభ సభ్యునిగా ఎంపిక చేస్తారు.ఈ క్రమంలోనే రాష్ట్రపతి కోటాలో భాగంగా సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరిని రాజ్యసభ సభ్యులుగా నియమిస్తున్నట్లు స్వయంగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించారు.
ఇకపోతే సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఈ అవకాశం లభించింది.ఈ క్రమంలోనే ఎంతోమంది సినీ ప్రేమికులు వీరికి అభినందనలు తెలియజేస్తున్నారు.
ఈ విధంగా రాజ్యసభకు ఎంపికైన వారికి స్వయంగా నరేంద్ర మోడీ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ క్రమంలోనే రాజ్యసభకు అర్హులైన వారిని ఎంపిక చేసినందుకు మెగాస్టార్ చిరంజీవి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ట్వీట్ చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
రాజ్యసభకు అత్యంత అర్హులైన విజయేంద్ర ప్రసాద్, ఇళయరాజా గారికి రాజ్యసభ సభ్యులుగా రాష్ట్రపతి నామినేషన్‌కు అర్హమైన గౌరవాన్ని గౌరవప్రదమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు అంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఈ క్రమంలోనే విజయేంద్ర ప్రసాద్ గారికి కూడా ఈయన ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యంత నిష్ణాతులైన, అద్భుతమైన కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ గారికి అభినందనలు అని తెలిపారు.ఇకపోతే సినీ పరిశ్రమకు చెందిన విజయేంద్ర ప్రసాద్ ఇళయరాజా రాజ్యసభ సభ్యులుగా ఎంపిక కావడం సభా వైభవాన్ని పెంచుతుంది అనడంలో సందేహం లేదని మెగాస్టార్ చిరంజీవికి ట్విట్టర్ వేదికగా ఈ విషయం పై స్పందించారు.







