రాజ్యసభకు నామినేట్ అయిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో పాటు ముగ్గురు ..!!

కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు రాష్ట్రపతి కోటాలో నలుగురిని నామినేట్ చేయడం జరిగింది.ఆ నలుగురిలో భారత దేశ దిగ్గజ దర్శకుడు రాజమౌళి తండ్రి ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఉండటం విశేషం.

 Rajamouli Father Vijayendra Prasad, Was Nominated To The Rajya Sabha Details,  R-TeluguStop.com

విజయేంద్ర ప్రసాద్ తో పాటు ప్రముఖ అథ్లెట్ పిటి ఉష, సంగీత డైరెక్టర్ ఇళయరాజా, స్వచ్ఛంద సేవకుడు వీరేంద్ర హెగ్డే నామినేట్ అయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.నామినేట్ అయిన వాళ్ళందరూ దక్షిణాదికి చెందిన వాళ్లే కావటం విశేషం.

ఇదిలా ఉంటే రాజ్యసభకు నామినేట్ అయిన విజయేంద్రప్రసాద్ పై ప్రధాని మోడీ ప్రశంసలు వర్షం కురిపించారు.విజయేంద్ర ప్రసాద్ రచనలు భారతదేశ అద్భుతమైన సంస్కృతిని ప్రదర్శిస్తాయని, ప్రపంచవ్యాప్తంగా ఒక ముద్రవేశాయని ప్రధాని మోడీ తెలిపారు.

ఈ క్రమంలో రాజ్యసభకు నామినేట్ అయినందుకు అభినందనలు తెలియజేశారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చత్రపతి, సింహాద్రి బాహుబలి, RRR, మగధీర ఇంకా చాలా సినిమాలకు కథ ఇవ్వడం జరిగింది.

హిందీలో సల్మాన్ ఖాన్ నటించిన బజరంగీ భాయిజాన్ స్టోరీ కూడా విజయేంద్ర ప్రసాద్ రాయటం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube