సోషల్ మీడియా ప్రభావం ప్రతి ఒక్కరిలో ఉంది.ముఖ్యంగా సెలబ్రెటీలు మాత్రం తమ ప్రాజెక్టులతో పాటుసోషల్ మీడియాలో కూడా బాగా సమయాన్ని గడుపుతున్నారు.
మంచి ఫాలోయింగ్ కూడా పెంచుకుంటున్నారు.ఇక సమయం దొరికినప్పుడల్లా తమ ఫాలోవర్స్ తో బాగా ముచ్చట్లు కూడా పెడుతున్నారు.
వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెబుతున్నారు.ఇదిలా ఉంటే తాజాగా నిషా అగర్వాల్ కూడా తన ఫాలోవర్స్ అడిగిన విషయాలకు ఓపన్ గా సమాధానం చెప్పింది.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి అందరికీ తెలిసిందే.ఇక ఈ ముద్దుగుమ్మ చెల్లెలే నిషా అగర్వాల్.ఏమైంది ఈవేళ సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది నిషా అగర్వాల్.ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా నటించింది.
అంతే కాకుండా తమిళం, మలయాళం భాషల్లో కూడా నటించింది.కానీ ఈ బ్యూటీ అంత గుర్తింపు సాధించుకోలేకపోయింది.
ఇక తన పెళ్లి తర్వాత సినీ ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయింది.ఇండస్ట్రీలో ఉన్నంతకాలం అంత ఫాలోయింగ్ సొంతం చేసుకోకపోయినా కూడా సినిమాలకు దూరమయ్యాకే విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.
ఇండస్ట్రీకి దూరంగా ఉన్న కూడా సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గా ఉంటుంది.
ఇక తన సోదరి కాజల్ అగర్వాల్ తో దిగిన ఫోటోలను.అంతే కాకుండా కాజల్ అగర్వాల్ కి సంబంధించిన విషయాలను కూడా పంచుకుంటుంది.ఇటీవలేకాజల్ అగర్వాల్ కి కొడుకు పుట్టగాఆ విషయాన్ని కూడా తనే మొదట సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది.
ఇక నిషా అగర్వాల్ కాజల్ అగర్వాల్ తో ఎంతో క్లోజ్ గా ఉంటూ.తమకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంటారు.అప్పుడప్పుడు నిషా అగర్వాల్ కొన్ని విలువైన మాటలు కూడా చెబుతూ ఉంటుంది.కానీ ఈమె ఎందుకో ఇండస్ట్రీలో అంతగా ఎక్కువ కాలం ఉండలేకపోయింది.
కానీ ఒక ఇల్లాలిగా, మంచి భార్యగామంచి తల్లిగా మాత్రం జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది.నిషా అగర్వాల్ అప్పుడప్పుడు ఫోటో షూట్ లంటూ బాగా బిజీగా ఉంటుంది.
ఇక తన ఫాలోవర్స్ తో కూడా బాగా ముచ్చట్లు పెడుతుంది.వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెబుతుంది.అంతేకాకుండా కాజల్ అగర్వాల్ గురించి కూడా చాలా విషయాలు పంచుకుంటూ ఉంటుంది.ఇక తాజాగా మరోసారి తన ఇన్ స్టా వేదికగా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టింది.
అందులో తన ఫాలోవర్స్ చాలా ప్రశ్నలు వేశారు.ఇక ఓ నెటిజన్ నిషా అగర్వాల్ వీక్నెస్ గురించి అడగటంతో.
కేక్స్, స్వీట్స్ తన వీక్నెస్ అంటూ తన వీక్నెస్ నిజాన్ని బయట పెట్టింది.ప్రస్తుతం ఈమె వీక్నెస్ గురించి నెట్టింట్లో బాగా వైరల్ గా మారుతుంది.